విడిపోతున్న బంధం

1

స్కాట్‌లాండ్‌లో ముగిసిన ప్రజాభిప్రాయసేకరణ

నేడు ఫలితం

ఎడిన్‌బరో, సెప్టెంబర్‌ 18 (జనంసాక్షి) :

స్కాట్‌లాండ్‌లో బంధం విడిపోతుం దో లేదో నేడు తేలనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపిన స్కాట్‌లాండ్‌ ప్రజాభిప్రాయ సేకరణ గురువారం ముగిసింది. ఫలితాలు నేడు ఉదయం ప్రకటిం చనున్నారు. యూకే నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడే విషయంలో స్కాట్‌ లాండ్‌ ప్రజల వైఖరి తేలనుంది. ఓటింగ్‌లో స్కాట్‌లాండ్‌ పౌరులు ఆసక్తిగా పాల్గొన్నారు. పోలింగ్‌బూత్‌లు తెరవకముందు ప్రజలు వాటి ముందు బారులు తీరారు. గత కొన్ని వారాలుగా స్కాట్లాండ్‌లో స్వాతంత్య్ర అనుకూల, వ్యతిరేక వర్గాల ప్రచారం ¬రేత్తించింది. స్వాతత్య్ర అనుకూల వర్గానికి అలెక్స్‌ సాల్మండ్‌ నేతృత్వం వహిస్తున్నారు. స్వతంత్ర దేశంగా మారేందుకు గల ఈ చరిత్రాత్మక అవకాశాన్ని వదులుకోరాదని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌ ట్రిన్‌ నుంచి విడిపోవద్దంటూ అభ్యర్థిస్తూనే, విడిపోతే వచ్చే ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకోలేరంటూ హెచ్చరించారు. యూకే ఐక్యంగానే కొనసాగుతుందన్న ఆశాభావాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా వ్యక్తంచేశారు. ఇంతకాలం బ్రిటన్‌తో కలిసుండటానికి మద్దతిచ్చిన స్కాట్‌లాండ్‌కు చెందిన టెన్నిస్‌ స్టార్‌ ఆండీ ముర్రె చివరి నిమిషంలో స్వతంత్ర వాదనకు మొగ్గు చూపుతూ ట్వీట్‌ చేశారు. ముర్రే ట్వీట్‌కు విశేష స్పందన లభించింది. అతి స్వల్ప మెజారిటీతో బ్రిటన్‌తో కలిసుండాలనే వాదనే విజయం సాధిస్తుందని తాజా సర్వేలో తేలింది. యుగవ్‌ చేసిన ప్రీ ఎలక్షన్‌ సర్వేలో 52శాతం మంది యూకేలో భాగంగానే ఉండాలని, 48శాతం మంది స్వతంత్ర దేశంగా ఉండాలని స్పష్టంచేశారు. దాంతో ఫలితాలు తెలిసేవరకు ఈ ఉత్కంఠ కొనసాగుతుంది.