కుటుంబాలు.. ఒక్కో ఇంటికి రూ.10లక్షలు
దస్త్రంపై సీఎం కేసీఆర్ సంతకం
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (జనంసాక్షి) : అమరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. 462 కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలు చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ఇందుకు సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంకతం చేశారు. ఇప్పటివరకు కలెక్టర్ల నుంచి అధికారికంగా అందిన నివేదిక ప్రకారం 462 మంది అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం మంజూరుచేస్తూ ఉత్వర్వుపై సోమవారం కేసీఆర్ సంతకం చేశారు. ఈ మొత్తాన్ని జిల్లాల వారిగా అతి త్వరలో అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం గౌరవపూర్వకంగా అందిస్తుందని సీఎం చెప్పారు. భవిష్యత్తులో వచ్చే అధికారిక నివేదికల ప్రకారం మిగతా కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుందని ముఖ్యమంత్రి హామీనిచ్చారు. కరీంనగర్‌లో 164 కుటుంబాలు, వరంగల్‌లో 93, మెదక్‌లో 52, నల్గొండలో 48, నిజామాబాద్‌లో 31, ఆదిలాబాద్‌లో 26, రంగారెడ్డిలో 18, మహబూబ్‌నగర్‌లో 17, హైదరాబాద్‌లో 11, ఖమ్మంలో రెండు కుటుంబాలకు సహాయం అందుతుంది.
అలాగే ఆసియా కప్ మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణం సాధించిన హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే టోర్నమెంట్‌లో డబుల్స్ కాంస్యం కూడా గెలిచిన సానియా తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చారని అభినందించారు. వరుసగా రెండు అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణం సాధించిన సానియా ఇదే జోరును కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఆసియాడ్‌లో గెలిచిన పతకాలతోపాటు మొత్తం ఆసియా క్రీడల్లో 8 పతకాలు సాధించిన క్రీడాకారిణిగా సానియా రికార్డు నెలకొల్పిందని సీఎం చెప్పారు.




