Monday, 2 November 2026

సర్వే ఆధారంగా కొత్త కార్డులు

C
ధర పెంచైనా నాణ్యమైన బియ్యం

మంత్రివర్గ ఉపసంఘం సమీక్ష

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 30 (జనంసాక్షి) : సమగ్ర సర్వే ఆధారంగా పేదలను గుర్తించి వారికి కొత్త రేషన్‌ కార్డులు, బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ధర పెంచైనా నాణ్యమైన బియ్యం అందించాలని నిర్ణయించింది. ఈమేరకు మంత్రివర్గ ఉపసంగం సమీక్షించింది. లెక్కకు మించి ఉన్న రేషన్‌ కార్డులను ఆధార్‌ అనుసంధానంతో ఇప్పటికే తొలగించారు. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసింది. సమావేశ వివరాలను మంత్రి ఈటెల వెల్లడిస్తూ.. సమావేశంలో రేషన్‌కార్డుల జారీ, సరుకుల సరఫరాపై చర్చించామన్నారు. కుటుంబానికి 30కిలోల బియ్యం అందజేతపై చర్చించామపన్నారు. చౌకధర కిలోబియ్యం రూ.3 చేసే విషయంపై కూడా సమాలోచనలు జరిపామని అన్నారు. ప్రస్తుతం ఇస్తున్న రూపాయి కిలో బియ్యం వల్ల ఖజానాపై భారీగా భారం పడడంతో పాటు బియ్యం పక్కదారి పడుతున్నాయి.దసరా తర్వాత మరోమారు భేటీయై పూర్తి నివేదికను రూపొందిస్తామన్నారు.  ముఖ్యమంత్రి ఆమోదం తర్వాత విధివిధానాలను ప్రకటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తామని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. నవంబర్‌ నెల నుంచి లబ్దిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు. సచివాలయంలో మంత్రివర్గ ఉప సంఘం సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. రేషన్‌ కార్డులు, పౌరసరఫరా, ఫించన్లపై సమావేశంలో చర్చించినట్టు చెప్పారు. రేషన్‌ బియ్యం ఉచితంగా ఇవ్వాలా, 30 కేజీలకు పెంచాలా అనే దానిపై కూడా చర్చించినట్టు తెలిపారు. దీనిపై ఈ నెలాఖరుకల్లా సీఎంకు నివేదిక అందజేస్తామని ఈటెల చెప్పారు. బియ్యం ధరలను మూడు నుంచి ఐదు రూపాయాలకు పెంచే ఆలోచనపై చర్చించారు. కమిటీ సమావేశంలో మంత్రి కెేటీఆర్‌, పౌరసరఫరాల కమిషనర్‌ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *