వాషింగ్టన్, సెప్టెంబర్ 30 (జనంసాక్షి) : అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం వాషింగ్టన్‌లో మహాత్మాగాంధీ విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన్ను చూసేందుకు వాషింగ్టన్ ప్రజలు భారీగా తరలివచ్చారు. మోదీ… మోదీ అంటూ నినాదాలు చేశారు. వందేమాతరం గీతం ఆలపించారు. మోదీ పర్యటన సందర్భంగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మోదీ వెంట భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తనను చూడడానికి వచ్చిన అమెరికా ప్రజలకు మోదీ అభివాదం చేశారు. ఒబామాతో విదేశాంగా మంత్రి జాన్ కెర్రీ కూడా సమావేశమయ్యారు. విమానాశ్రయంలో మోడీకి ఘనంగా స్వాగతం లభించింది. ఎన్‌ఆర్‌ఐలు పెద్ద ఎత్తున మోడీకి స్వాగతం పలికారు.
గాంధీ విగ్రహానికి ప్రధాని నివాళి




