Monday, 2 November 2026

తలో చేయెస్తే పరిశుభ్ర భారత్‌

Untitled-2
గాంధీజీ కలలు సాకారం

స్వచ్ఛ్‌ భారత్‌ యావత్‌ దేశ ప్రజల కార్యక్రమం

ప్రధాని నరేంద్రమోడీ

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 2 (జనంసాక్షి) : ప్రతి వ్యక్తి తనవంతుగా కృషిచేస్తే పరిశుభ్ర భారత్‌ నిర్మితమవుతుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అప్పుడే గాంధీజీ కలలు సాకారమవుతాయన్నారు. స్వచ్ఛ్‌ భారత్‌ యావత్‌ దేశ ప్రజల కార్యక్రమమన్నారు. పరిశుభ్ర భారత్‌ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛభారత్‌’ కార్యక్రమం గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. జాతిపిత గాంధీ 145 జయంతి సందర్భంగా చేపట్టిన ఈ పారిశుద్ధ్య ఉద్యమం 2019 నాటికి పరిశుభ్ర భారత్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంగారకుడ్ని చేరుకున్న భారతీయులు పరిశుభ్ర భారత్‌ కలను సాధ్యం చేయలేరా? అని ప్రశ్నించారు. ఈ మహాయజ్ఞం కేవలం ప్రభుత్వంతోనే సాధ్యం కాదని.. ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వేచ్ఛ భారత్‌, స్వచ్ఛ భారత్‌ అని జాతిపతి గాంధీజీ సందేశమిచ్చారని, కానీ పరిశుభ్ర భారత్‌ ఇప్పటికీ అసంపూర్తిగా ఉండిపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. బాపూజీ ఆశయ సాధన కోసం మనమంతా చేయాల్సింది ఒక అడుగు ముందుకు మాత్రమేనని అన్నారు. అందుకే ‘స్వచ్ఛ భారత్‌’ కార్యక్రమాన్ని ప్రారంబించినట్లు తెలిపారు. భారతీయులంతా కలిసికట్టుగా పని చేసి ఒక ప్రేరణాత్మక వాతావరణాన్ని సృష్టించాలని తెలిపారు. గురువారం ఉదయం ఢిల్లీలోని వాల్మీకి బస్తీ, ఇండియా గేట్‌ వద్ద స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లు ఊడ్చి చెత్త ఎత్తివేశారు. అనంతరం మోడీ మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ స్వేచ్ఛ భారత్‌, స్వచ్ఛ భారత్‌ కోరుకున్నారని తెలిపారు. ఆయన నాయకత్వంలో స్వాతంత్య్రం సాధించుకున్నాం. కానీ, మహాత్ముడి స్వచ్ఛ భారత్‌ కల మాత్రం నేటికీ సాకారం కాలేదని తెలిపారు. ఆయన నినాదంతోనే స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం చేపట్టామన్నారు. ‘స్వచ్ఛ భారత్‌’ 125 కోట్ల మంది ప్రజల కార్యక్రమమని అన్నారు. పారిశుద్ధ్యంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్‌ ఇది సాధిస్తుంది.. భారత ప్రజలు సాధించగలరని ధీమా వ్యక్తం చేశారు. మనమంతా దేశభక్తితో ఇది చేయాలే కానీ.. రాజకీయ ఉద్దేశ్యంతో కాదన్నారు. స్వచ్ఛ భారత్‌ రాజకీయ కార్యక్రమం కాదని.. దేశంపై ప్రేమతో చేపట్టినది వెల్లడించారు. దేశంలో ఉన్న పరిస్థితులను మహాత్మాగాంధీ కళ్లద్దాల ద్వారా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అతి తక్కువ ఖర్చుతో అంగారకుడిపై మార్స్‌ను ప్రయోగించిన మనం దేశాన్ని శుభ్రం చేసుకోలేమా? అని ప్రశ్నించారు. మార్స్‌ మిషన్‌ పూర్తి చేసింది ప్రధాని, మంత్రులు కాదని.. భరతమాత బిడ్డలని అన్నారు. శాస్త్రవేత్తల కృషి వల్లే మనం అంగారక గ్రహాన్ని చేరుకున్నామని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ భారత్‌ను కూడా సాధించుకుంటామన్నారు. సర్పంచ్‌లో ప్రోత్సాహంతో వంద శాతం పరిశుభ్రంగా మారిన గ్రామాలను అనేకం తాను చూశానన్నారు. పరిశుభ్రత కేవలం సఫాయి కార్మికులదేనా? ఇందులో మనకు బాధ్యత లేదా? అని మోడీ ప్రశ్నించారు. ఇది కేవలం సఫాయి కార్మికుల పనే కాదని.. ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. 125 కోట్ల మంది భారతీయులు ఇక భారతమాత మురికిగా ఉండాలని అనుకోరని తెలిపారు. పాల అలవాట్లను మానుకోవడం కొంచెం కష్టమే, అయితే, అందకు మనకు 2019 వరకు సమయం ఉందని మోడీ అన్నారు. సోషల్‌ విూడియాలో మైక్లీన్‌ ఇండియా ప్రచారం ప్రారంభించామన్నారు. చెత్త ఉన్న ప్రాంతం ఫొటో తీయండి, ఆ తర్వాత వాటిని శుభ్రం చేశాక ఫొటో తీసి నెట్‌లో పెట్టాలని మోడీ సూచించారు. సోషల్‌ విూడియా ద్వారా స్వచ్ఛభారత్‌కు ప్రచారం పెంచాలని కోరారు. చెత్తను తొలగించే కార్యక్రమాన్ని సోషల్‌ విూడియాలో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. అపరిశుభ్రత వల్ల వచ్చే రోగాలకు కుటుంబం ఏటా రూ.ఆరు వేలు ఖర్చు పెడుతోందని మోడీ గుర్తు చేశారు. పరిశుభ్రతను పాటిస్తే ఆ ఆరువేలు ఆదా చేసిన వారు అవుతారన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరితో మోడీ స్వచ్ఛ భారత్‌ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఇండియాగేట్‌ నుంచి భారీ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కారీ, వెంకయ్యనాయుడు, బాలీవుడ్‌ నటుడు అవిూర్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

తొమ్మిది మందికి మోడీ సవాల్‌..

ఇటీవల తెరపైకి వచ్చిన ఐస్‌ బకెట్‌ చాలెంజ్‌.. ఇప్పుడు స్వచ్ఛ భారత్‌కు కూడా పాకింది. మోడీ.. తొమ్మిది మంది సెలబ్రటీలకు సవాల్‌ విసిరారు. బహిరంగ ప్రదేశాలలో పరిశుభ్రత కార్యక్రమంలో తాను తొమ్మిది మంది పాల్గొనాలని పిలుపునిచ్చానని ఆయన స్వయంగా వెల్లడించారు. ఆ తొమ్మిది మంది మరో తొమ్మిది మందికి ఆహ్వానం పలకాలని కోరారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో పాల్గొనాలని భారతరత్న సచిన్‌ టెండుల్కర్‌, కాంగ్రెస్‌ నేత శశిధరూర్‌, సినీ నటుడు కమల్‌ హాసన్‌, కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌, యోగా గురు బాబా రాందేవ్‌, బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా, తారక్‌ మెహతా, మృదుల సిన్హాలకు ఆహ్వానం పలికినట్లు వెల్లడించారు. వారు మరో తొమ్మిది ఇలాగే ఆహ్వానిస్తారని.. ఆ తొమ్మిది మంది మరో తొమ్మిది మందిని పిలుసర్తారని చెప్పారు. ఇది ఇలా గొలుసులా కొనసాగుతుంది.. ఇలా స్వచ్ఛభారత్‌ నిరంతరంగా కొనసాగుతుందన్నారు.

ఠాణాలో మోడీ ఆకస్మిక తనిఖీలు

ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన విలక్షణత చాటుకున్నారు. ఆకస్మికంగా పోలీసుస్టేషన్‌ను తనిఖీచేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఢిల్లీలోని వాల్మీకి బస్తీలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు బయల్దేరిన మోడీ.. మార్గమధ్యలోని మార్గ్‌ పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేశారు. ఆకస్మాత్తుగా తన కాన్వాయ్‌ను ఆపేసి ఠాణాలోకి వెళ్లారు. పోలీసుస్టేషన్‌ ఎంత పరిశుభ్రంగా ఉందో ఆయన పరిశీలించారు. కొద్దినిమిషాల పాటు అక్కడ గడిపిన మోడీ స్టేషన్‌లో పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాల గురించి ఆరా తీశారు. మహాత్ముడు కలలుకన్న గ్రామస్వరాజ్యం కోసం ఓ యజ్ఞం పస్రారంభమయ్యింది. అదే ‘స్వచ్ఛ భారత్‌’ కార్యక్రమం. మహాత్ముడి జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోడీ ఈ కార్యక్రమాన్ని చేపట్టి పరిశుభ్ర భారత్‌ నిర్మాణానికి పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్‌ ఏ ఒక్కరిదో కొందరిదో కాదన్నారు. ఇది 125 కోట్ల మంది ప్రజల కార్యక్రమమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. గురువారం ఉదయం ఢిల్లీలోని వాల్మీకి బస్తీ, ఇండియాగేట్‌ వద్ద స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహాత్మాగాంధీ నాయకత్వంలో స్వాతంత్యం సాధించుకున్నాం… కానీ మహాత్ముడి స్వచ్ఛభారత్‌ కల మాత్రం నేటికీ సాకారం కాలేదన్నారు. క్విట్‌ ఇండియా, క్లీన్‌ ఇండియా అని మహాత్ముడు సందేశమిచ్చారని మోదీ గుర్తు చేశారు. ఇప్పుడు క్లీన్‌ ఇండియా దిశగా మనం కదలాలన్నారు.  పారిశుద్ధ్యంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారత్‌ ఇది సాధిస్తుంది.. భారత ప్రజలు సాధించగలరని మోదీ ధీమా వ్యక్తం చేశారు. సోషల్‌ విూడియాలో మై క్లీన్‌ ఇండియా ప్రచారం ప్రారంభించారు. సోషల్‌విూడియా ద్వారా స్వచ్ఛభారత్‌కు ప్రచారం పెంచాలని కోరారు. పరిశుభ్రపరచడం పారిశుద్ధ్య కార్మికుల బాధ్యత మాత్రమే కాదు. ఈ ఆలోచనా విధానం నుంచి మనం బయటపడాలి. సోషల్‌ విూడియాలో మైక్లీన్‌ ఇండియా ప్రచారం ప్రారంభించాం. పారిశుద్ధ్యంలో ప్రజలూ భాగస్వాములు కావాలి. భారత్‌ ఇది సాధిస్తుంది. భారత ప్రజలు ఇది సాధించగలరని ప్రధాని పేర్కొన్నారు.శాస్త్రవేత్తల కృషి వల్లే మనం అంగారక గ్రహాన్ని చేరుకున్నామన్నారు. ప్రజలందరూ కలిసి పనిచేస్తే స్వచ్ఛభారత్‌ కూడా సాధ్యమేనని ప్రధాని మోదీ అన్నారు.  శాస్త్రవేత్తల కృషి వల్ల మనం అంగారక గ్రహాన్ని చేరుకున్నాం. అందరూ కలిసి పనిచేస్తే స్వచ్ఛ భారత్‌ కూడా సాధ్యమే. స్వచ్ఛభారత్‌లో అందరూ వారంలో 2గంటలపాటు పాల్గొనాలి. క్విట్‌ ఇండియా, క్లీన్‌ ఇండియా అని మహాత్ముడు సందేశమిచ్చారు.  దీనిని సాధించిన మనం ఇక దేనినైనా సాధించగలమన్న ధీమా వ్యక్తంచేశారు. స్వచ్ఛభారత్‌ రాజకీయ కార్యక్రమం కాదు. దేశంపై ప్రేమతో చేపట్టినదని వెల్లడించారు. చెత్తను తొలగించే కార్యక్రమాన్ని సోషల్‌విూడియాలో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. కార్యక్రమానికి హాజరైన ప్రతిఒక్కరితో మోదీ స్వచ్ఛభారత్‌ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఇండియాగేట్‌ నుంచి భారీ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నితిన్‌ గడ్కరీ, బాలీవుడ్‌ నటుడు అవిూర్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *