నిరాకరించిన కర్ణాటక హైకోర్టు
బెయిలుపై మీడియా అసత్య ప్రచారం
గుండు గీయించుకొని బాణాసంచా కాల్చిన అభిమానులకు నిరాశ
బెంగుళూరు/చెన్నై, అక్టోబర్ 7 (జనంసాక్షి) : జయకు బెయిలు ఇచ్చేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. బెయిలుపై మీడియా అసత్య ప్రకారం చేసింది. బెయిల్ వచ్చిందన్న అన్నా ఇఎంకె కార్యకర్తల ఆనందం అంతలోనే ఆవిరయ్యింది. గుండు గీయించుకొని బాణాసంచా కాల్చిన అభిమానులకు నిరాశే మిగిలింది. సంబురాలు జరుపుకుంటున్న వీరు హతాశులయ్యారు. తమ పురుచ్చితల్లికి బెయిల్ రాలేదని తెలుసుకుని ఆందోళనకు గురయ్యారు. బెయిల్ వచ్చిందంటూ హడావిడిగా ప్రచారం, బ్రేకింగ్ న్యూస్ ప్రసారంచేసిన న్యూస్ ఛానళ్లు అంతలోనే నో బెయిల్ అంటూ వార్తలను ప్రసారం చేశాయి. నిజానికి బెయిల్‌పై నిర్ణయం తీసుకోక ముందే ఒకరిని చూసి మరొకరు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇదిలావుంటే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. జయలలిత దాఖలుచేసిన బెయిల్ పిటిషన్‌ను మంగళవారం విచారించిన న్యాయస్థానం ఆమెకు బెయిల్ మంజూరు చేయలేదు. జయలలిత షరతులతో కూడిన బెయిల్ పొందడానికి ప్రాసిక్యూషన్ అభ్యంతరం తెలపకపోవడంతో జయకు బెయిల్ మంజూరవుతుందని అందరూ భావించారు. ఏఐఏడీఎంకే శ్రేణులు సంబరాలు సైతం జరుపుకొన్నారు. జయ తరఫున ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలాని వాదించారు. బెయిల్ కోసం ఆయన, ప్రాసిక్యూషన్ లాయర్ మధ్య వాదోపవాదాలు సాగాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల ఆమెను ప్రత్యేక కోర్టు దోషిగా నిర్దారించి నాలుగేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దాంతో సెప్టెంబరు 27 నుంచి జయలలిత బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలులో ఉన్నారు. బెయిల్ పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో జయ ఉన్న జైలు వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటుచేశారు. ¬సూరు రోడ్డులో జయ మద్దతుదారులు వేలాదిగా చేరారు. అయితే ఆమెకు బెయిల్ మంజూరు కాకపోవడంతో వారంతా హతాశులయ్యారు. కోర్టు ఉత్తర్వులు వెల్లడికాకముందే బెయిల్ వచ్చిందంటూ తమిళ విూడియా అత్యుత్సాహ ప్రచారం చేయడంతో దేశవ్యాప్తంగా విూడియా జయలలితకు బెయిల్ వచ్చిందంటూ ప్రసారం చేశాయి. సీబీఐ అధికారి మాటలతో తొందరపడ్డ తమిళ విూడియా కారణంగా జయలలిత బెయిల్ లభించిందంటూ వచ్చిన వార్తలతో తమిళనాట పండగ వాతావరణం నెలకొంది. బెయిల్ రాలేదంటూ ఆ తర్వాత వచ్చిన వార్తలతో అన్నాడీఎంకే మద్దతుదారులు నిరుత్సాహానికి గురయ్యారు. అమ్మకు బెయిల్ రావాలి.. ఆమె బయటకు వచ్చి మాకు దర్శనం ఇవ్వాలి అంటూ తమిళనాట వేలాది మంది మొక్కుకున్నారు. అమ్మకు బెయిల్ రావాలంటూ వందలాది మంది సామూహికంగా ముందుగానే గుళ్లు గీయించుకున్నారు. ఉపవాసాలు ఉన్నారు. దేవుడి గుళ్ల ముందు యాగాలు చేశారు. అయితే ఆ మొక్కులు ఫలించలేదు.. జయలలితకు బెయిల్ రాలేదు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష పడి సెప్టెంబర్ 27వ తేదీన జయలలిత జైల్లోకి వెళ్లినప్పటి నుంచి తమిళనాడు, కర్ణాటక రెండు రాష్టాల్ల్రో తమిళులు.. ముఖ్యంగా అన్నాడీఎంకే అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నిరాహార దీక్షలు, మౌన దీక్షలు, ప్రదర్శనలు.. ఇలా అన్ని రకాలుగా ఆమెకు సంఘీభావం తెలియజేస్తూ వచ్చారు. తమిళ సినీ పరిశ్రమ మొత్తం కొన్ని రోజులు స్తంభించింది. పాఠశాలలు, కళాశాలలు.. ఇలా అన్నిరకాల విద్యాసంస్థలు పనిచేయడం మానేశాయి. చివరకు అభిమానుల నుంచి కొన్ని బెదిరింపులు కూడా వచ్చాయి. జయలలితకు బెయిల్ రాకపోయిందో.. తమిళనాడులో ఉన్న కన్నడిగులందరినీ బందీలుగా చేస్తామంటూ పోస్టర్లు కూడా వేశారు. ఎంత చేసినా కర్ణాటక హైకోర్టు జడ్జి మాత్రం ఆమెకు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదనే తేల్చి చెప్పేశారు. కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఆమెకు ఇవ్వడానికి తమకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదని సీబీఐ తరఫున వాదించిన న్యాయవాదులు చెప్పినా కూడా న్యాయమూర్తి మాత్రం ఆ వాదనలతో ఏకీభవించలేదు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. కర్ణాటక హైకోర్టు ధర్మాసనం మంగళవారం మధ్యాహ్నం ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. జయ తరపున ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ వాదించారు. లాలూ ప్రసాద్‌కు బెయిల్ వచ్చిన విషయాలను, జయకు ఉన్న ఆరోగ్య సమస్యలనూ ఆయన ఏకరువు పెట్టారు. అయితే జడ్జి మాత్రం ఇవేవిూ పట్టించుకోలేదు. దీంతో కర్ణాటక హైకోర్టు ప్రాంగణంలో కాసేపు హై డ్రామా చోటు చేసుకుంది. తొలుత జయలలితకు బెయిల్ మంజూరైనట్టుగా వార్తలు వెలువడ్డాయి. తమిళ విూడియా అత్యుత్సాహం చూపడంతో నిజమేననుకుని జాతీయ విూడియా కూడా వార్తలు వెలువడ్డాయి. జయ మద్దతు దారులు సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే న్యాయస్థానం జయకు బెయిల్ నిరాకరించడంతో కథ మారిపోయింది. జయలలితతో పాటు ఆమె మద్దతుదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. జయలలిత అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని అంతకుముందు రాం జెఠ్మలాని కోర్టుకు విన్నవించారు. ఆమె చట్టం, న్యాయాన్ని గౌరవించే వ్యక్తని చెప్పారు. జయలలిత దేశం వదలి పారిపోరని రాం జెఠ్మలాని కోర్టుకు తెలియజేశారు. అయితే సీబీఐ తరపు న్యాయవాది అభ్యంతర వ్యక్తం చేశారు. ఇరువురి వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం బెయిల్ పిటీషన్ను కొట్టేసింది. జయ మద్దతు దారులు పెద్దఎత్తున తరలిరావడంతో కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటుచేశారు. కోర్టు ప్రాంగణంలో 144 సెక్షన్ విధించారు. దీంతో ఇప్పుడామె సుప్రీంను ఆశ్రయించాల్సిందే.





