
ముంబై, అక్టోబర్ 7 (జనంసాక్షి) : మహారాష్ట్ర నుంచి ముంబైని విడదీసే శక్తి ఎవరికీ లేదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ముంబైని మహారాష్ట్ర నుంచి వేరుచేసే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదని ప్రధాని పేర్కొన్నారు. మంగళవారం ఆయన మహారాష్ట్రలోని గిరిజన ప్రాంతమైన ధలిలే జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ నేతలు గత పదేళ్లుగా బూటకపు హావిూలే ఇచ్చారని, ఇప్పుడు మళ్లీ కొత్త అబద్ధాలు చెప్తున్నారని తెలిపారు. ముంబైని విడదీస్తారంటూ దుష్పచ్రారం చేస్తున్నారని అన్నారు. ఇంతకన్నా దారుణం మరొకటి లేదన్నారు. మహారాష్ట్రలో ముంబై అంతర్భాగమన్నారు. తాను ప్రధానిగా ఉండగా అది జరగదన్నారు. గత పదేళ్లలో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్సే కారణమని ధ్వజమెత్తారు. ప్రజలు అక్టోబరు 15 న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను ఎన్నుకోవాలని కోరారు. ‘రాజకీయ నాయకులు ఎన్నికల హావిూలను మర్చిపోతారేమో కానీ నేను మర్చిపోను. నేను రాజకీయ నాయకుడిని కాదు. విూ సేవకుడిని’ అని మోదీ పేర్కొన్నారు. తాను భారత్‌లో ప్రధాన సేవకుడినన్నారు. కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోయి అనవసర ఆరోపణలు చేస్తోందన్నారు. తాను ఇచ్చిన హావిూలను నెరవేర్చడం లేదన్న కాంగ్రెస్ విమర్శలపై మోదీ ఘాటుగా స్పందించారు. తాను ఏం చేశానో అది ఐదేళ్లలో తెలుపుతామన్నారు. వారిలాగా ఆచరణ సాధ్యంకాని హావిూలు ఇవ్వలేదన్నారు.
మహరాష్ట్ర నుంచి ముంబైను విడదీసే శక్తి ఎవరికీ లేదు : మోడీ




