లండన్, అక్టోబర్ 7 (జనంసాక్షి) : భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి పొందారు. గత ఏడాదిలాగే ఈసారి కూడా భౌతికశాస్త్రంలో ముగ్గురిని బహుమతి వరించింది. జపాన్‌కి చెందిన భౌతిక శాస్త్రవేత్తలు ఇసాము అకసాకి, హిరోషి అమానో, జపాన్‌లో పుట్టి అమెరికాలో స్థిరపడిన షుజి నకమురాలు ఈ ఏటి నోబెల్ విజేతలుగా ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. తక్కువ శక్తితో ఎక్కువ కాంతినిచ్చే ఎల్‌ఈడీ లైట్‌ని కనిపెట్టినందుకు వీరికి ఈ బహుమతి లభించింది.
శాస్త్రవేత్తల పదవీ విరమణ వయసు పెంపు!
భారత కేంద్ర ప్రభుత్వం శాస్త్రవేత్తల పదవీ విరమణ వయసును పెంచే అవకాశముంది. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని కేంద్ర శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం, భూ అధ్యయన శాస్‌ాల శాఖలు, అణు ఇంధనం, అంతరిక్షం విభాగాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఢిల్లీలో చెప్పారు. పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదన తన శాఖల పరిధిలోని శాస్త్రవేత్తలకే పరిమితమని స్పష్టం చేశారు. 60 ఏళ్లకు చేరుకునే సరికి వారు సముపార్జించే అపార విజ్ఞానాన్ని, అనుభవాన్ని మరో రెండేళ్లపాటు వినియోగించుకోవాలని, పదవీ విరమణ వయసు పెంపు ప్రతిపాదన సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నామని వివరించారు. ఈ విషయంలో సానుకూల చర్యలు తీసుకోవడానికి అనేక శాఖల ఆమోదం అవసరమని తెలిపారు.
భౌతికశాస్త్రంలో ముగ్గురు సైంటిస్టులకు నోబెల్





