Monday, 2 November 2026

నింగికెగిసిన మరో ఉపగ్రహం

8-10-5వాతావరణ రాకెట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన జపాన్‌
హైదరాబాద్‌, అక్టోబర్‌ 7 (జనంసాక్షి) : మరో ఉపగ్రహం నింగికెగిసింది. వాతావరణ రాకెట్‌ను జపాన్‌ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. జపాన్‌ మంగళవారం హిమవరి-8 అనే వాతావరణ ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపించింది. ఈ ఉపగ్రహాన్ని హెచ్‌-2ఏ అనే రాకెట్‌ ద్వారా జపాన్‌లోని తానేగేషిమా స్పేస్‌ సెంటర్‌ నుంచి నింగిలోకి ప్రయోగించారు. హిమవరి-8 వాతావరణ పరిస్థితులపై అధ్యయనాన్ని మరింత మెరుగుపరుస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తుఫాను, అగ్నిపర్వతాల పేలుళ్లుపై ముందస్తు హెచ్చరికలు మరింత ప్రభావవంతంగా అందజేస్తుంది. జపాన్‌లో ఇటీవలే అగ్నిపర్వతం పేలి 60మంది మరణించారు. అలాగే ఉపగ్రహ ప్రయోగానికి ముందు రోజే జపాన్‌లో భారీ తుఫాను సంభవించింది. ఈ ఉపగ్రహ ప్రయోగానికి 155మిలియన్‌ డాలర్ల ఖర్చైంది. 2016లో హిమవరి-9 ఉపగ్రహం ప్రయోగించనున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *