Monday, 2 November 2026

తెలంగాణ రాష్ట్ర పౌరులకు గుర్తింపుకార్డులు

8-10-6

అక్టోబర్‌ 15లోగా పెన్షన్లకు దరఖాస్తు చేసుకోండి

త్వరలో రుణమాఫీ

విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ధృవపత్రాలు

వికలాంగులకు ప్రత్యేక శిబిరాల ద్వారా పత్రాలు

ప్రభుత్వ పథకాలకు రేషన్‌కార్డుతో సంబంధంలేదు

సంక్షేమ బాట పట్టిన తెలంగాణ సర్కారు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 7 (జనంసాక్షి) : తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ బాట పట్టింది. తెలంగాణ రాష్ట్ర పౌరులకు కొత్త గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సచివాలయంలో మంగళవారం వివిధ శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. అక్టోబర్‌ 15లోగా పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. త్వరలోనే రుణమాఫీ అమలవుతుందని స్పష్టంచేశారు. కొత్తగా విద్యార్ధులకు ఆదాయ, కుల, నివాస ధృవీకరణ పత్రాలు ఇస్తామన్నారు. ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి వికలాంగులకు పత్రాలు అందజేస్తామన్నారు. రుణమాఫీ వందశాతం అమలు చేయాలని, బ్యాంకర్లతో ప్రతిరోజు సమావేశాలు, సమీక్షలు నిర్వహించి రైతులకు కొత్తగా రుణాలు అందేలా చూడాలని కలెక్టర్లను అదేశించారు. ఆహార భద్రత చట్టం ప్రకారం నిరుపేదలందరికి నిత్యావసర సరుకులు అందించేందుకు తెలంగాణ స్టేట్‌ ఫ్యామిలీ పుడ్‌ సెక్యూరిటీ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. పెంచిన పెన్షన్‌ సొమ్మును కూడా నవంబర్‌లో అందించనన్నట్లు ప్రకటించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం పేరుతో విద్యార్థులకు కావలసిన సర్టిఫికేట్లన్నీ ఒకేసారి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఫాస్ట్‌ పథకంలో లబ్ది కోరేవారు ఈ నెల 15వ తేదీలోగా సర్టిఫికెట్ల కోసం తహశీల్దార్‌ (ఎంఆర్‌వో) కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. తహశిల్దారులు ఈ దరఖాస్తులను పరిశీలించి నెలాఖరులోగా సర్టిఫికెట్లు అందించాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో వృద్దులు, వికలాంగులు, వితంతువులకు కూడా పెన్షలు పెంచామని వాటిని కూడా నవంబరర్‌ నెల నుండే అందించాలని ముఖ్యమంత్రి చెప్పారు. పెన్షన్లు కావలసిన వారు తమ దరఖాస్తులను అక్టోబర్‌ 15వ తేదీలోగా విఆర్‌వోలకు అందించాలని, తెల్ల కాగితం మీద పూర్తి వివరాలతో దరఖాస్తు రాస్తే సరిపోతుందని ముఖ్యమంత్రి చెప్పారు. విఆర్‌వోలు ఆదరఖాస్తులన్నింటిని తహశిల్దార్‌ కార్యాలయంలో ఇవ్వాలని, తహశిల్దారు ఆధ్వర్యంలో వాటిని పరిశీలించి అర్హులకు పెన్షను అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెన్షన్‌ మంజూరైన వారందరికి ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా సాంక్ష లెటరన రాయాలని కూడా రాయాలని కూడా సీఎం నిర్ణయించారు. వికలాంగులకు సదరం పర్టిఫెకెట్లు మంజూరుచేయడం కోసం ఏరియా ఆసుపత్రులలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. అక్టోబర్‌ 15వ తేదీలోగా పంట రుణాల మాఫీ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాలని సీఎం కలెక్టర్లను కోరారు. బ్యాంకర్లకు చెల్లించాల్సిన మొదటి విడత సొమ్ము రూ.4,250కోట్లు ఇప్పటికే బ్యాంకులకు అందాయన్నారు. కాబట్టి రైతులు కొత్తగా రుణాలు పొందేందుకు మార్గం సుగమం అయ్యిందని వెల్లడించారు. ప్రతిరోజు బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి ప్రతిరైతు కొత్తగా రుణం పొందేలా చూడాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దారిద్రవ్యరేఖకు దిగువన ఉన్న పేదలందరికి నిత్యావసర సరుకులు అందించేందుకు తెలంగాణ స్టేటన ఫ్యామిలీ ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారు, వ్యాపారవేత్తలను మినహాయించి మిగతా పేదలందరికి ఈ కార్డులు అందించాలని చెప్పారు. ఈ నెల 15లోగా ఫుడ్‌ సెక్యూరిటీ కార్డు కోసం విఆర్‌వోలకు దరఖాస్తు చేసుకోవాలని, విఆరనవోలు ఈ దరఖాస్తులను గ్రామల వారిగా విభజించి ఎంఆరనవో కార్యాలయంలో అందించాలని చెప్పారు. గ్రామలలో లబ్దిదారులను గుర్తించేందుకు అధికారులు క్షుణంగా పరిశీలన జరపాలని చెప్పారు. తప్పులు దొర్లితే సదరు అధికారి బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా వెల్లడించారు. నిరుపేద కుటుంబంలోని ప్రతిఒక్కరికి 5కిలోల చొప్పున బియ్యం అందించడానికి సీఎం సూత్రప్రాయంగా అంగీకరించారు. లబ్దిదారుల ఎంపిక కూడా ఈ నెలాఖరులోగా పూర్తికావాలని చెప్పారు. జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు బియ్యం అందించనున్నట్లు వెల్లడించారు. పుడన సెక్యూరిటీ కార్డు కేవలం నిత్యావసర సరుకులు తీసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుందని, గతంలో రేషనన కార్డు మాదిరిగా అన్ని పథకాలకు దీనితో సంబంధం లేదని సీఎం  స్పష్టంచేశారు. ఎంఆర్‌ఓ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించేందుకు ఇద్దరు రెవిన్యూ అధికారులను కేటాయించాలని కూడా కలెక్టర్లకు ముఖ్యమంత్రి చెప్పారు. పుడన సెక్యూరిటీ, పెన్షన్‌ కోసం లబ్ధిదారుల ఎంపిక, పెన్షన్‌దారుల గుర్తింపు తదితర కార్యక్రమాలన్నీ తహశీల్దారుల పర్యవేక్షణలో జరగాలని, డివిజన్ల వారిగా ప్లయింగన స్వ్కాడనలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. పై కార్యక్రమాల్లో లబ్దిదారులను ఎంపిక చేసే క్రమంలో ఏమైనా ఇబ్బందులు తలెతిత్తే ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లో ఉన్న అధికారులు పరిష్కరిస్తారని, ఇందుకోసం హెల్ఫ్‌లైన్‌ను కూడా ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇటీివల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని కుటుంబాల సమగ్ర స్వరూపాన్ని తెలుసుకున్నదని సీఎం చెప్పారు. సర్వేలో వచ్చిన వివరాలపై మరోసారి పరిశీలన కూడా జరిపి అధికారికంగా ప్రకటించాలని సీఎం నిర్ణయించారు. తెలంగాణలోని పౌరులకు ప్రత్యేక గుర్తింపు కార్డు ఇవ్వాలని కూడా సీఎం ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవన శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగరావు, వివిధ శాఖల కార్యదరు&శలు నాగిరెడ్డి, రేమాండన పీటరన, పూనం మాల కొండయ్య, పార్దసారధీ, బిపి ఆచార్య, రాజా, జోషి, కలెక్టర్లు రాహులన బొజ్జా, శ్రీధర్‌ జి. కిషన్‌ ఇలంబర్తి, చిరంజీవులు, ప్రియదర్శిని, రోనాల్డ్‌ రోస్‌, జగన్మోహన్‌, వీరబ్రహ్మయ్య, స్మితాసబర్వాల్‌, జాయింట్‌ కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *