చండీఘడ్, అక్టోబర్ 8 (జనంసాక్షి) : కుంభకోణాల హర్యానా కావాలా? లేదా సిల్క్ హర్యానా కావాలా? ప్రజలు నిర్ణయించుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. హర్యానా రాష్ట్రం ప్రస్తుతం పలు రకాల కుంభకోణాలతో సతమతమవుతోందని, భాజపాను ఎన్నుకుంటే స్కాం హర్యానాను స్కిల్ హర్యానాగా మారుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విూ గడప ముందు వాలే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి.. కుటుంబ పాలననలు తరిమి కొట్టండని మోడీ పిలుపునిచ్చారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఆయన హర్యానాలోని మహేంద్రగఢ్, రోహ్‌తక్ ప్రాంతాలలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. గత 25ఏళ్లలో వారసత్వ రాజకీయాల వల్ల హర్యానా అభివృద్ధి చెందలేదని, భాజపా ఈ రాష్టాన్న్రి వేగంగా అభివృద్ధి చేస్తుందని మోదీ తెలిపారు. స్కాం హర్యానా కావాలో.. స్కిల్ హర్యానా కావాలో విూరే తేల్చుకోండని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. తాను కొందరు ప్రముఖులకు సమాధానం ఇవ్వడానికి ప్రధానమంత్రి కుటుంబంలోనూ, ముఖ్యమంత్రి కుటుంబంలోనూ జన్మించలేదని, తాను సాధారణ ప్రజల నుంచే వచ్చానని కేవలం వారికి మాత్రమే సమాధానం చెప్తానని మోదీ తెలిపారు. ఇక్కడ గత కొన్నేళ్లుగా ఏం జరుగుతుందో తెలియంది కాదన్నారు. కేవలం కుటుంబాల కోసమే సర్కర్ నడవడం సిగ్గుచేటన్నారు. రాజకీయాల్లో అస్పృశ్యత పనికిరాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ 125వ జయంతిని ఘనంగా జరుపుకుందామని పిలుపు ఇవ్వడం కొందరు కాంగ్రెస్ నేతలకు మింగుడు పడడంలేదని మోదీ వ్యాఖ్యానించారు. హర్యానాలో వ్యవసాయాన్ని, పరిశ్రమలను అభివృద్ధి చేస్తామని ఆయన హావిూఇచ్చారు. హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, బంధుప్రీతి, పక్షపాతం, కండబలంతో ప్రజలు విసిగిపోయారని నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. బుధవారం రాష్ట్రంలోని మహేంద్రగఢ్‌లో ఆయన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఆయన ప్రధానంగా హర్యానాలోని కాంగ్రెస్ ప్రభుత్వంపైనే దృష్టి సారించారు. అవినీతి లేని రాష్ట్రంగా చూడాలనుకుంటున్నారా? అని అడిగారు. కండబలం కలిగిన నాయకుల నుంచి, నిజాయితీలేని వారి నుంచి హర్యానా విముక్తి కోరుకుంటున్నారా? అలాంటప్పుడు కొత్తదారి ఎంచుకోవాల్సిందేనని, ఆ నిర్ణయం తీసుకోవాల్సింది హర్యానా రాష్ట్ర ప్రజలేనని మోదీ సూచించారు
స్కామ్ హర్యానా కావాలా? సిల్క్ హర్యానా కావాలా? : మోడీ





