ముంబై, అక్టోబర్ 8 (జనంసాక్షి) : స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు సైతం ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ముంబైలో చీపురు పట్టి రోడ్లు వూడ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు అనిల్ అంబానీ స్వచ్ఛ భారత్ కార్యక్రమ ప్రచారానికి పూనుకున్నారు. మంగళవారం రాత్రి ముంబయిలోని చర్చిగేటు సవిూపంలో తన బృందంతో కలిసి రోడ్లు శుభ్రం చేశారు. చర్చిగేటు వద్ద రోడ్డును శుభ్రం చేయడానికి అనిల్ అంబానీ, అతడి స్నేహితుల కృషి అద్భుతమని మోదీ ట్వీట్ చేశారు. ఇలా అందరూ ముందుకురావాలని కోరారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రతిఒక్కరూ కృషిచేయాలన్నారు. ఆరోగ్యవంతమైన భారతదేశం కోసం పరిశుభ్రత తప్పనిసరి అన్నారు. స్వచ్ఛ్ భారత్ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. అనీల్ అంబానీ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని పలువురు సెలెబ్రెటీలకు సవాల్ విసిరారు. మేరీ కోమ్, అమితాబ్, సానియా విూర్జా, శోభా డే, జర్నలిస్ట్ శేఖర్ గుప్తా, పాటల రచయిత ప్రషన్ జోషి, హృతిక్ రోషన్, టాలీవుడ్ హీరో నాగార్జునలతో పాటు రన్నర్స్ క్లబ్ ఆఫ్ ఇండియాకి అనిల్ అంబానీ స్వచ్ఛ్ భారత్ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా అనీల్ అంబానీ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్రమోడీ పిలుపు ఇచ్చిన స్వచ్ఛ భారత్ అభియాన్ ఉద్యమం విజయవంతం కావడానికి అంకితభావంతో పనిచేస్తానని అన్నారు. అనీల్ అంబానీని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం మంచి ప్రయత్నమని ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
స్వచ్ఛ్ భారత్‌లో నేనూ సైతం చీపురు పట్టిన అనీల్ అంబానీ





