జమ్మూ, అక్టోబర్ 8 (జనంసాక్షి) : పాకిస్తాన్ మరోసారి హద్దుమీరింది. భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరుపుతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ దాన్ని ఉల్లంఘిస్తూ పాక్ సైనికులకు కాల్పులకు తెగబడుతున్నారు. సాంబ, కొత్వా జిల్లాలతోపాటు కానాచాక్, ఆర్నియా, పర్గావల్ ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులకు దిగింది. బీఎస్‌ఎఫ్ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ సైనికులు జరుపుతున్న కాల్పుల్లో ఇరవై మంది గాయపడ్డారు. వీరిలో భారత జవాన్లతోపాటు పదిహేను మంది సామాన్య పౌరులు కూడా వున్నారు. గాయపడిన వారిలో ఒక మహిళ మరణించినట్టు తెలుస్తోంది. పాక్ సైనికుల కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. పాక్ దాడులను భారత్ జవాన్లు తిప్పికొడుతున్నారు. పాకిస్థాన్ వరుసగా కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడుతోంది. జమ్మూకాశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో పాక్ సైన్యం మరోమారు కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఆరుగురికి గాయాలయ్యాయి. కాల్పులను భారత సైన్యం తిప్పికొడుతోంది. ఎల్‌ఓసీ వద్ద పరిస్థితిని తీవ్రంగా పరిగణిస్తున్నామని ఎయిర్ చీఫ్ అరూప్ రాహా పేర్కొన్నారు. దీనిపై ¬ంమంత్రి రాజ్‌నాథ్ ఎప్పటికప్పుడు సవిూక్షించారు. పక్కాగా తిప్పి కొట్టాలని బిఎస్‌ఎఫ్ జవాన్లకు పిలుపునిచ్చారు.
పాక్ మళ్లీ హద్దుమీరింది





