అప్రమత్తమైన అధికార యంత్రాంగం
హైదరాబాద్/విశాఖపట్టణం, అక్టోబర్ 8 (జనంసాక్షి) : 0అండమాన్ పరిసర సముద్రంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ తుపానుకు అధికారులు హుదూద్ అని పేరు పెట్టారు. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఇది 24 గంటల్లో పెనుతుపానుగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం లాంగ్ ఐలాండ్‌కి అతిసవిూపంలో కొనసాగుతున్న తుపాను కొద్ది గంటల్లో అండమాన్- నికోబార్ తీరాన్ని దాటవచ్చని అధికారులు పేర్కొన్నారు. తుపాను ఉత్తర కోస్తాంధ్ర- దక్షిణ ఒడిశా తీరానికి సవిూపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఈ నెల 12న విశాఖ- గోపాలపూర్ మధ్యలో ఇది తీరం దాటనుంది. తుపాను ప్రభావం వల్ల అండమాన్ పరిసరాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. వేటకు వెళ్లే మత్య్సకారులు అటువైపు వెళ్లవద్దని తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 11నుంచి కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50-60కి.విూ. వేగంతో గాలులు వీచవచ్చని, ఈ నెల 12 నుంచి 130-140 కి.విూ. వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. 11వ తేదీనుంచి తుపాను ప్రభావం ఆంధప్రదేశ్ రాష్ట్రంపై ఉండే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవవచ్చు.ఇప్పటికే పలుచోట్ల వర్షాలు పడ్డాయి.





