న్యూఢిల్లీ, అక్టోబర్ 8 (జనంసాక్షి) : రసాయనంలోనూ ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం దక్కింది. ఈ ఏడాది రసాయనశాస్త్రంలో నోబెల్ పురస్కారం ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. అమెరికాకు చెందిన ఎరిక్ బెట్‌జిగ్, విలియం మోర్నర్, జర్మనీకి చెందిన స్టీఫెన్ హెల్‌లు సూపర్ రిసాల్వ్‌డ్ ఫ్లోరోసెన్స్ మైక్రోస్కోప్ రూపొందించినందుకుగాను నోబెల్ బహుమతి దక్కించుకున్నారు. నానోడైమెన్షన్‌లో ఆప్టికల్ మైక్రోస్కోపీని తీసుకురావడానికి వీరి సేవలకుగాను నోబెల్ బహుమతి అందిస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడవిూ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. ఇదిలావుంటే విద్యుత్‌ను ఆదా చేసే ఎల్‌ఈడీ దీపాలను కనుగొన్న జపాన్ పరిశోధకులు ఇసాము అకసాకి, హిరోషి అమానో, జపాన్-అమెరికన్ షణజి నకామురాలకు భౌతిక శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి వరించింది. భూతాపాన్ని ఎదుర్కోవడంతోపాటు నిరుపేదలకు ఆశాకిరణంగాను ఈ దీపం గుర్తింపుపొందింది.
రసాయనంలోనూ ముగ్గురు సైంటిస్టులకు నోబెల్





