Monday, 2 November 2026

చౌతాలా లొంగిపో

5
బెయిలు రద్దుచేసిన కోర్టు

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 10 (జనంసాక్షి) : హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలాకు కోర్టు బెయిలు రద్దుచేసింది. పెరోల్‌పై ఉన్న  చౌతాలా లొంగిపోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆయన ఎన్నికల ప్రచారాంలో ఉండడంపై కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఉపాధ్యాయుల నియామక అవకతవకల్లో నిందితుడుగా ఉన్న విషయం విదితమే. ఈ కేసులో చౌతాలా శనివారం  జైలు అధికారులు ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. వైద్యుల సూచనతో చౌతాలాను ఎయిమ్స్‌లో చేర్పించవచ్చని సూచించింది. చౌతాలా ఎలాంటి బహిరంగ సభల్లోనూ మాట్లాడరాదని ఆదేశించింది. ఈ మేరకు చౌతాలా బెయిలును ఢిల్లీ హైకోర్టు రద్దుచేసింది. హర్యానాలో ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో చౌతాలాకు 10ఏళ్ల జైలుశిక్ష పడిన సంగతి తెలిసిందే. అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా మే నెలలో ఆయనకు బెయిలు మంజూరైంది. అయితే ఆయన ప్రస్తుతం హర్యానా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండడంతో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, ఆయన బెయిలును రద్దు చేయాలని సీబీఐ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు శుక్రవారం ఆయనను ఇక విూదట ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని, బెయిలు రద్దుచేస్తున్నందున జైలుకు వెళ్లాలని ఆదేశించింది. ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో గత ఏడాది జనవరిలో ఓంప్రకాశ్‌ చౌతాలాతోపాటు ఆయన కొడుకు అజయ్‌, మరో 8మందికి పదేళ్ల జైలుశిక్ష పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *