Tuesday, 3 November 2026

సీనియర్‌ జర్నలిస్టు విజయ్‌కుమార్‌ మృతికి సీఎం సంతాపం

2
ఢిల్లీ, అక్టోబర్‌ 11 (జనంసాక్షి) : కరీంనగర్‌కు చెందిన సీనియర్‌ జర్నలిస్టు జీవగడ్డ విజయ్‌కుమార్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం ప్రకటించారు. విజయ్‌కుమార్‌ కుటుంబ సభ్యులకు కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీనియర్‌ జర్నలిస్టు జీవగడ్డ విజయ్‌కుమార్‌ అనారోగ్యంతో కన్నూమూశారు. గత కొంతకాలంగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరీంనగర్‌ కేంద్రంగా విద్యుల్లత, జీవగడ్డ పత్రికలు విజయ్‌కుమార్‌ నడిపారని సీఎం గుర్తు చేశారు. జీవితాంతం వృత్తిపట్ల పూర్తి నిబద్ధత ప్రదర్శించారని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న విజయ్‌కుమార్‌ ఎంతోమంది జర్నలిస్టులకు గురువుగా జీవితాన్ని సార్థకం చేసుకున్నారని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. అలాంటి వ్యక్తులు తెలంగాణ అభివృద్ధికి అవసరమని అన్నారు. పాలకుల భజనలు మాని ప్రజా సమస్యలపైనే దృష్టిసారిస్తూ పనిచేసే జర్నలిస్టులు తయారుకావాల్సిన అవసరముందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో జర్నలిస్టులుందరూ కలిసిరావాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *