ఒక ఎంపీ నియోజకవర్గంలో ఓ ఆదర్శ గ్రామాన్ని చేయండి
జననేత లోక్‌నాయక్ జయప్రకాశ్ : ప్రధాని నరేంద్రమోడీ
న్యూఢిల్లీ, అక్టోబర్ 11 (జనంసాక్షి) : సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ శనివారం ప్రారంభించారు. ఒక ఎంపీ నియోజకవర్గంలో ఓ ఆదర్శ గ్రామాన్ని తయారుచేయాలని కోరారు. లోక్‌నాయక్ జయప్రకాశ్ జననేత అని కొనియాడారు. శనివారం న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా దేశంలోని గ్రామాల అభివృద్దే లక్ష్యంగా రూపొందించిన ఈ పథకాన్ని మోడీ ప్రారంభించారు. అనంతరం మోడీ ప్రసంగిస్తూ గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని అన్నారు. ఇందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. తాను కూడా వారణాసి నియోజకవర్గంలోని ఒక గ్రామాన్ని ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు. పేదల అభివృద్ధే మన ప్రధాన కల కావాలని… పేదలు, రైతుల కోసమే సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ప్రతి పార్లమెంట్ సభ్యుడు గ్రామాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అందుకోసం తన నియోజకవర్గంలోని ఏటా ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని… ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అలా 2016 నాటికి దేశవ్యాప్తంగా ఆదర్శ గ్రామాలను తయారు చేయాలని ఆకాంక్షించారు. ఎంపీలు ఎమ్మెల్యేలు గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్ది ప్రజలకు మార్గదర్శకం కావాలన్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్టాల్ర ఎంపీ ల్యాడ్స నిధులతో గ్రామాలను అభివృద్ధి చేయాలని సూచించారు. 1915లో విదేశాల నుంచి స్వదేశం వచ్చిన మహత్మ గాంధీ గ్రామాభివృద్ధికి పాటపడిన తీరును మోడీ వివరించారు. అలాగే గ్రామాల హక్కుల కోసం గాంధీజి పోరాడిన తీరును కూడా ఈ సందర్భంగా మోడీ విశదీకరించారు. గ్రామాభివృద్ధికి గాంధీజీయే మనకు స్పూర్తి ప్రధాత అని అన్నారు. పేదలు, రైతుల కోసమే గ్రామ సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనను ప్రారంభించినట్లు చెప్పారు. పేదల అభివృద్దే మన ప్రధాన కల కావాలని మోడీ ఆకాంక్షించారు. ప్రతి ఎంపీ ఏటా తన నియోజకవర్గంలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శంగా తీర్చిదిద్దితే గ్రామాల స్వరూపమే మారుతుందన్నారు. ప్రతి పార్లమెంట్ సభ్యుడు గ్రామాభివృద్ధిని బాధ్యతగా తీసుకోవాలన్నారు. అన్ని గ్రామాలు ఒకే రకంగా ఎందుకు లేవు? కొన్ని మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయంటే.. కేవలం ప్రజల ఆలోచనా తీరే దీనికి కారణమని వ్యాఖ్యానించారు. 2016 మార్చి నాటికి ఆదర్శగ్రామాలుగా తీర్చిదిద్దాలని కోరారు. స్వాతంత్యం వచ్చిన నాటి నుంచి గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. గ్రామాల అభివృద్ధి కోసం ప్రయత్నాలు సాగుతూనే ఉండాలన్నారు. 1915లో భారత్‌కు తిరిగివచ్చిన నాటి నుంచి మహాత్మాగాంధీ గ్రామాల అభివృద్ధికి పాటుపడ్డారని గుర్తు చేశారు. కాలం ప్రకారం మనం మారాలి… మార్పు నిరంతర పక్రియ అని మోదీ పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రధానికి మంత్రి నితిన్ గడ్కరీ స్వాగతం పలికారు.





