జైట్లీని కలిసిన సీఎం, ఎంపీలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 11 (జనంసాక్షి) : తెలంగాణకు ప్రత్యేక ¬దా ఇవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఎంపీలు వినోద్, బాల్క సుమన్ కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రితోపాటు ఎంపీలు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు ప్రత్యేక ¬దా ఇవ్వాలని జైట్లీని కోరినట్లు వినోద్ విూడియాకు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాలను జైట్లీ వద్ద కేసీఆర్ ప్రస్తావించారని తెలిపారు. ఏపీకి ప్రత్యేక ¬దా ఇచ్చినప్పుడు తెలంగాణకు కూడా ఇవ్వాలని కోరామని చెప్పారు. తెలంగాణలో 8 జిల్లాలు బాగా వెనుకబడి ఉన్నాయని పేర్కొన్నారు. తమ విజ్ఞప్తిపై జైట్లీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. హైదరాబాద్‌లో పన్నుల వసూళ్లపేరుతో అధికా ఆదాయం చూపుతున్నారని, కానీ ఇప్పుడు చాలా కంపెనీలు ఎపికి కడుతున్నాయని అన్నారు. ఎపి పేరుతో ఉండడంతో ఇది ఎపిఇ వెళుతోందని అందుకే దీనిని ఆర్థికమంత్రికి చూపామని అన్నారు. ఇక్డి ఆయిల్ కంపెనీలతో పాటు అనేక కంపెఎనీలు టాక్స్ ఎపికి చెల్లిస్తున్నాయని చెప్పారు. ఇది తెలంగాణకురావాల్సి ఉందన్నారు. ఇక పిడికెడు బొగ్గు దొరకని ఏపీలో విద్యుత్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. బొగ్గు విరివిగా దొరికే తెలంగాణలో విద్యుత్ కొరత ఎందుకు ఉందన్నారు. ఇందుకు కారణం గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలేనని మండిపడ్డారు. యాత్రలు చేస్తున్న ఎర్రబల్లి తదితరులు సీలేదు వద్ద ధర్నాకు దిగాలన్నారు. సీలేరును గుంజుకున్నందుఉ ధర్నా చేయాలన్నారు. అక్కడ మనకు రావాల్సిన విద్యుత్ రాకుండా చేసినందుకు ధర్నా చేయాలన్నారు. ఇంతాలం పాలన చేసిన కాంగ్రెస్,టటిడిపిలు తెలంగాణాలో ఎందుకు విద్యుత్ ప్లాంట్లు పెట్టలేదో నేతలు నిలదీయాన్నారు. తెలంగాణలో తాము బిహెచ్/-ఇఎల్లో ఒప్పంద చేసుకుని అనేక విద్యుత్ కేంద్రాల స్థాపనకు రంగం సిద్దం చేశామన్నారు. మణుగూరు, భూపాల్ పల్లి తదితర ప్రాంతల్లో ప్లాంట్లు రాబోతున్నాయని అన్నారు. ఇవన్నీ మరచి కాంగ్రెస్, టిడిపి నేతలు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో బొగ్గు, నీళ్లు ఉన్నా విద్యుత్ ప్లాంట్లు పెట్టని చంద్రబాబు.. తన బానిసలతో యాత్రలు చేపిస్తూ కుక్కల్లా మొరిగిస్తే అబద్ధాలు నిజాలు కావు అని టీఆర్ఎస్ ఎంపీ సుమన్ ధ్వజమెత్తారు. తెలంగాణలో ఆంధ్రా ఆధిపత్యం కొనసాగించేందుకు బాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్లోకి వలసలను ఆపేందుకే బాబు యాత్రలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ టీడీపీ నేతలు బస్సు యాత్రలు చేయడం మాని.. బాబు ఇంటి ముందు దీక్ష చేయాలని సూచించారు. కృష్ణపట్నం నుంచి తెలంగాణకు రావాల్సిన కరెంట్‌ను బాబు ఆపింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్టు ఆంధ్రాకు పోవడానికి బాబు కారణం కాదా అని ప్రశ్నలు సంధించారు. కరెంట్ ఛార్జీలు తగ్గించమంటే తెలంగాణ రైతులను కాల్చి చంపించిన నైజం బాబుది అని తీవ్రంగా విరుచుకుపడ్డారు. చంద్రబాబు చెప్పిందల్లా విని ఇక్కడ కెసిఆర్‌ను విమర్శిస్తూ పోతే ఊరుకోమని హెచ్చరించారు. విూడియా సమావేశంలో అధికారప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు.





