శ్రీనగర్, అక్టోబర్ 11 (జనంసాక్షి) : పాకిస్తాన్ మరోసారి హద్దుమీరింది. సరిహద్దుల్లో మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పూంచ్ సెక్టార్‌లో పాక్‌బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. గశుక్రవారం వెనక్కి తగ్గినట్లే తగ్గిన బలగాలు మరోమారు తెగించాయి. అయితే ఇందులో ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం. దీనిపై సరిహద్దు భద్రతాదళం అప్రమత్తం అయ్యింది. ఇటీవల సాంబ, కొత్వా జిల్లాలతోపాటు కానాచాక్, ఆర్నియా, పర్గావల్ ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులకు దిగింది. బీఎస్‌ఎఫ్ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ సైనికులు జరుపుతున్న కాల్పుల్లో ఇరవై మంది గాయపడ్డారు. వీరిలో భారత జవాన్లతోపాటు పదిహేను మంది సామాన్య పౌరులు కూడా వున్నారు. పాకిస్థాన్ వరుసగా కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడుతోంది. జమ్మూకాశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో పాక్ సైన్యం మరోమారు కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఆరుగురికి గాయాలయ్యాయి. ఎల్‌ఓసీ వద్ద పరిస్థితిని తీవ్రంగా పరిగణిస్తున్నామని ఎయిర్ చీఫ్ అరూప్‌రాహా ఇప్పటికే తెలిపారు. దీనిపై ¬ంమంత్రి రాజ్‌నాథ్ ఎప్పటికప్పుడు సవిూక్షించారు. పక్కాగా తిప్పికొట్టాలని బిఎస్‌ఎఫ్ జవాన్లకు పిలుపునిచ్చారు.
మళ్లీ హద్దుమీరిన పాక్





