Tuesday, 3 November 2026

ఆంధ్రాకు సాయం అందిస్తాం : సీఎం కేసీఆర్‌

8

హైదరాబాద్‌, అక్టోబర్‌ 12 (జనంసాక్షి) : హదూద్‌ తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఎలాంటి సహాయ, సహకారాలు కావాలన్నా అందించడానికి సిద్ధమని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి తమ సంసిద్ధత తెలియజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేసీఆర్‌ ఆదేశించారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శి కృష్ణారావుతో తెలంగాణ సీఎస్‌ రాజీవ్‌శర్మ మాట్లాడారు. తుపాను అనంతర సహాయకచర్యల్లో పాల్గొనేందుకు సిద్ధమని శర్మ తెలిపారు. ఉత్తరాంధ్రలో తుపాను తాకిడితో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సాయం చేసేందుకు సిద్దమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కేసీఆర్‌ సూచనల మేరకు కృష్ణారావుతో రాజీవ్‌శర్మ చర్చించినట్టు తెలిసింది. తుపాను బీభత్సంతో ఆంధ్రాప్రాంతంలో విజయనగరం, విశాఖ జిల్లాలు అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణలోని వనరులను దోచుకోవాలని ప్రయత్నిస్తున్న అక్కడి ప్రజల బాధలను అర్థంచేసుకొని ఆ ప్రభుత్వానికి సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం ముదావహం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *