న్యూఢిల్లీ, అక్టోబర్ 12 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. హుదూద్ పెను తుపాను దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన సహాయం అందిస్తామని మోదీ హావిూ ఇచ్చారు. ప్రధాని అధ్యక్షతన తుపానుపై అత్యున్నత స్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు. కేబినెట్ కార్యదర్శి అజిత్‌సేథ్, ¬ంశాఖ, రక్షణ శాఖ కార్యదర్శులు, వాతావరణ శాఖ సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్ ఏపి, ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఎప్పటికప్పుడు సవిూక్ష నిర్వహిస్తున్నారు. తుపాను పరిస్థితిని తెలుసుకుంటున్నారు. హుదూద్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాలపై విరుచుకుపడింది. భారీ వర్షాలు, భీకర గాలులతో అతలాకుతలం చేసింది. దాదాపు 200 కిలోవిూటర్ల వేగంతో ప్రపంచ గాలులు వీస్తున్నాయి. తుఫాన్ కారణంగా సంభవించిన విధ్వంసానికి నలుగురు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు రెండున్న లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒడిశాలో లక్ష మందిని పునరావాస కేంద్రాలకు పంపారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా విశాఖ నగరంపై పడింది. ప్రపంచ పవనాల ధాటికి చెట్లు, విద్యుత్ సంభాలు కూలిపోయాయి. ముందుజాగ్రత్తగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, రవాణా వ్యవస్థను నిలిపివేశారు. తుఫాన్ కారణంగా ఇప్పటివరకు 70 ఇళ్లు దెబ్బతిన్నాయని, 34 జంతువులు మృతి చెందాయి. ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు, ఒడిశాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
ఏపీని ఆదుకుంటాం : ప్రధాని నరేంద్రమోడీ





