Tuesday, 3 November 2026

హర్యానా, మహారాష్ట్రలో నేడు పోలింగ్‌

4  న్యూఢిల్లీ,అక్టోబర్‌14(జనంసాక్షి):  హర్యానా, మహారాష్ట్రలో నేడు పోలింగ్‌ జరగనున్నాయి. ఎన్నికల సంఘం అన్నీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. ఈనెల 19న ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మహారాష్ట్రలో 288స్థానాలకు గాను 4,119మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 1,699మంది స్వతంత్రులు ఉన్నారు. 8.25కోట్లమంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. కాంగ్రెస్‌ అత్యధికంగా 287 స్థానాల్లో పోటీ చేస్తుండగా, శివసేన 282, బీజేపీ 280, మహారాష్ట్ర నవ నిర్మాణసేన 219 స్థానాల్లో బరిలో దిగుతున్నాయి. హర్యానాలోని 90 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 1,351మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1.63 కోట్లమంది ప్రజలు ఓటు వేయనున్నారు. కాగా, మహారాష్ట్రలో మిత్రపక్షాలైన కాంగ్రెస్‌-ఎన్సీపీ, శివసేన-బీజేపీ విడిపోయి.. ఎవరికి వారు సొంతంగా పోటీ చేస్తుండటంతో ఈ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. పోలింగ్‌ నేపథ్యం లో హర్యానాలో రాష్ట్ర ప్రభు త్వం బుధవారం సెలవుదినంగా ప్రకటించింది. నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో ¬రెత్తిన మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 6 గంటలకు అన్ని పార్టీలు ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేశాయి. దీంతో మైకులన్నీ ఒక్కసారిగా మూగబోయాయి. ఇక నేటి ఎన్నికలకు రంగం సిద్దం చేసుకున్నాయి. ప్రధాని మోడీ ప్రధాన ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్‌ నుంచి సోనియా, రాహుల్‌ పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *