Tuesday, 3 November 2026

విశాఖలో అన్నమోరామచంద్ర

3

తాగునీరు, నిత్యావసరాలు దొరకక ప్రజల ఇక్కట్లు

విశాఖపట్టణం,అక్టోబర్‌14(జనంసాక్షి) : హుదుద్‌ తుపాను మిగిల్చిన విషాదం నుంచి ఉత్తరాంధ్ర ప్రజలు ఇంకా తేరుకోలేదు. విశాఖ నగరంలో రవాణా, విద్యుత్‌, తాగునీరు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాలు దొరక్క విశాఖ వాసులు అవస్థలు పడుతున్నారు. పాలు, ఉల్లిపాయలు, కూరగాయల కోసం కుస్తీ పడుతున్నారు.  వీటిని అత్యధిక ధరలకు అమ్మడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సిఎం చంద్రబాబు హెచ్చరిక చేస్తున్న, మరోవైపు సరుకులు మాత్రం దొరకడంలేదు. పాల ప్యాకెట్‌ 100 రూ. నుంచి 50 రూ.ల వరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో నిత్యావసర సరుకులు, పాల ధరలు కొండెక్కాయి. వ్యాపారులు అధిక ధరకు పాలు విక్రయిస్తుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్‌ బంకుల వద్ద జనం బారులుతీరారు. గంటల కొద్ది నిలుచున్న ఫలితం లేకుండా పోతుంది. గత మూడు రోజుల నుంచి తాగునీరు లేకపోవడంతో నగర వాసులు అల్లాడుతున్నారు. కనీస అవసరాలు కూడా తీరక ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లల పరిస్థితి దయనీంగా ఉంది. పలు ప్రాంతాల్లో  నీటి సరఫరా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  దశలవారీగా విద్యుత్‌ పునరుద్ధరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏటీఎంలు పనిచేయకపోవడంతో కొందరు డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం మోబైట్‌ సేవలు అందించాలని ప్రజలు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *