Tuesday, 3 November 2026

కూలిన యుద్ద విమానం

5
పైలెట్లు సురక్షితం

పుణె అక్టోబర్‌ 14 (జనంసాక్షి) : ఓ యుద్ధ విమానం కూలి పోయిన ఘటన పుణెలో మంగళవారం సంభవించింది. భారత యుద్ధ విమానం సుఖోయ్‌ 30 ఎమ్‌ -ఐ తూర్పు పుణెకు 35 కిలోవిూటర్ల దూరంలో కుప్పుకూలింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ఈ ఘటనలో పైలెట్‌ తో సహా కో పైలెట్‌ కూడా క్షేమంగా బయటపడ్డారు. వారు స్వల్పపాటి గాయాలతో బయటపడ్డారు. ఈ ఇద్దరి పైలెట్లను ఒక ఐఎఎఫ్‌ హెలికాప్టర్‌ లో తీసుకొచ్చినట్లు ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌ తెలిపింది. ఈ దుర్ఘటన మంగళవారం మధ్యాహ్నం 1.10 ప్రాంతంలో జరిగినట్టు లాహ్‌ గాన్‌ ఏఎఫ్‌ఎస్‌ అధికారి స్పష్టం చేశారు. గాలిలోకి ఎగిరిన కాసేపట్లోనే విమానం కూలినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *