
ఫలించని అధికారుల ప్రయత్నం
చిన్నారి కుటుంబాన్ని అదుకుంటాం
మంత్రి మహేందర్రెడ్డి
రంగారెడ్డి,అక్టోబర్14(జనంసాక్షి): జిల్లా మంచాల గ్రామంలో బోరుబావిలో పడిన చిన్నారి గిరిజ మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు. బావిలో 45 అడుగుల వద్ద ఆమె మృతదేహాన్ని గుర్తించినట్లు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి చెప్పారు. మృతదేహాన్ని వెలికి తీస్తామని ఆయన తెలిపారు. ఎంతో శ్రమకోర్చి తవ్వకాలు చేపట్టినా ప్రయత్నాలు ఫలించలేదు. బోరు బావిలో పడిన ఐదేళ్ల చిన్నారి గిరిజ కోసం సహాయక చర్యలు చేపట్టినా ఫలితం దక్కలేదు. బోరుబావికి సమాంతరంగా సహాయక సిబ్బంది 45అడుగుల మేర గోయ్యి తవ్వారు. సుమారు 45 అడుగుల వద్ద చిన్నారిని గుర్తించినట్లు ఆయన తెలిపారు. చిన్నారిని ప్రాణాలో వెలికి తీసేందుకు తీవ్రంగానే ప్రయత్నించినా ఫళితం దక్కలేదు. తవ్వకాలు చేపట్టగా . 41 అడుగుల దగ్గర రాయి వచ్చింది. దాన్ని పగలగొట్టాం. అందుకే ఆలస్యమైంది. పాప ప్రాణాలకు ప్రమాదం వాటిల్లకుండా 41 అడుగుల స్థాయిలోనే పాపను గుర్తించాం. ఖమ్మానికి చెందిన సింధూర ఎలక్టాన్రిక్స్ వాళ్లు అందించిన కెమెరాను ఉపయోగించాం. పాప మృతదేహం 45 అడుగుల లోతులో ఉంది. 41 అడుగుల ప్రాంతంలో ఉన్న సొరంగం ద్వారా కెమెరా పంపించి, మరోసారి నిర్ధారించుకుని పాపను పుల్ చేయాలి. అందుకు కావల్సిన హుక్లు తెప్పించాం. అయితే, అక్కడ పనిచేసేందుకు సరిపోయేంతగా ప్రదేశం లేదు. అక్కడ సొరంగం తవ్వడం కూడా చాలా కష్టం అవుతోంది. అందుకే ఎక్కువ సమయం పడుతోందని ఆయన తెలిపారు
చిన్నారి కుటుంబాన్ని ఆదుకుంటాం
బోరుబావిలో పడ్డ చిన్నారి కుటుంబాన్ని ఆదుకుంటామని తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న బోరుబావులను వెంటనే మూసివేయాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. చిన్నారి పడిన బోరుబావి స్థల యజమానిపై కేసు నమోదు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాల్టా చట్టాన్ని అమలు చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామంలో బోరుబావిలో పడిన చిన్నారి గిరిజ మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు. బావిలో 45 అడుగుల వద్ద ఆమె మృతదేహాన్ని గుర్తించినట్లు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి చెప్పారు.




