మహరాష్ట్రలో 64శాతం, హర్యానాలో 73 శాతం
భాజపాకే మొగ్గు : ఎగ్జిట్‌పోల్ సర్వే
న్యూఢిల్లీ, అక్టోబర్ 15 (జనంసాక్షి) : రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మహరాష్ట్రలో 64శాతం, హర్యానాలో 73 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఎగ్జిట్‌పోల్ సర్వే ప్రజలు భారతీయ జనతా పార్టీకే ప్రజలు పట్టం కట్టనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడక్కడ స్వల్ప ఘటనలు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగింది. 288 అసెంబ్లీ స్థానాలకు 4,119 మంది పోటీలో ఉన్నారు. హర్యానాలో 90 స్థానాలకు 1351 మంది పోటీలో ఉన్నారు. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తమైంది. పదిహేను సంవత్సరాల తర్వాత బీజేపీ- శివసేన, కాంగ్రెస్ -ఎన్సీపీ పొత్తులు లేకుండా ఒంటరిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్, ఐఎన్‌ఎల్డీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నెల 19న ఓట్ల లెక్కింపు జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతానికి హర్యానాలో 50శాతం పోలింగ్ నమోదు కాగా, మహారాష్ట్రలో 46 శాతం పోలింగ్ నమోదైంది. ముంబయిలో మధ్యాహ్నం ఒంటి గంటకు కేవలం 21శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ముంబయిలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకొని ప్రజలను విధిగా ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. క్రికటెర్ టెండూల్కర్, షారూఖ్ ఖాన్,సల్మాన్ ఖాన్ తదితరులు ఓటింగ్‌లో పాల్గొన్నారు.
మహారాష్ట్రలో ఓటేసిన సరిహద్దు గ్రామవాసులు
మహారాష్ట్ర ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు గ్రామవాసులు ఓటేశారు. జిల్లా సరిహద్దులోని పరందోలి, అంతాపూర్ గ్రామాలకు తెలంగాణ, మహారాష్ట్రలో ఓటు హక్కు ఉంది. 1956 నుంచి ఈ రెండు గ్రామాలు రెండు రాషాలె పరిధిలో ఉంటూ వస్తున్నాయి. దాంతో ఈరోజు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఈ రెండు గ్రామాల ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉదయం మందకోడిగా ప్రారంభమైన పోలింగ్ ఆ తర్వాత పుంజుకొంది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు, హర్యానాలోని 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ ఆ తర్వాత వేగం పుంజుకొంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపారు. పోలింగ్ బహిష్కరించాలని నక్సల్స్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. గడ్చిరోలి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. దీంతో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. మహారాష్ట్రలో 90, 403 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 8.25 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక హర్యానాలో 16,244 పోలింగ్ కేంద్రాల్లో 1.63 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. ఉదయం 11 గంటలకు హర్యానాలో కేవలం 12 శాతం లోపే ఓటింగ్ నమోదైంది. బాద్షాపూర్‌లో 10.3 శాతం, గూర్గావ్‌లో 11.8, పటౌడిలో 11.4, సోనాలో 9.3 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత క్రమంగా పోలింగ్ పుంజుకొంది. మహారాష్ట్రలో పోలింగ్ ప్రారంభమైన తొలి నాలుగు గంటల్లో కేవలం 25 శాతం మాత్రమే ఓటింగ్ నమోదు కాగా.. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి హర్యానాలో 34 శాతం పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలోని 288 స్థానాలకు గాను కాంగ్రెస్ అత్యధికంగా 287 స్థానాల్లో తన అభ్యర్థులను బరిలోకి దించింది. బీజేపీ కూటమి 280, శివసేన 282, ఎన్సీపీ 278, ఎంఎన్‌ఎస్ 219 చోట్ల పోటీచేశాయి. హర్యానాలో 90 సీట్లకుగాను 1351 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 19న ఆదివారం రెండు రాష్టాల్ల్రో ఓట్ల లెక్కింపు జరుగనుంది.
ఓటేసిన ప్రముఖులు : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కారీ, ప్రకాశ్ జగదేకర్, మాజీ కేంద్ర మంత్రి సుశీల్‌కుమార్ షిండే, ఎన్సీపీ అదినేత శరద్‌పవార్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, శివసేన అధినేత ఉద్దవ్ థాకరే తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్, జయాబచ్చన్, నటి రేఖ తదితరులు ఓటు వేశారు.





