హైదరాబాద్, అక్టోబర్ 16 (జనంసాక్షి) : పీఎస్‌ఎల్‌వీ-సీ26 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేె.చంద్రశేఖర్‌రావు అభినందరించారు. ప్రతి ప్రయోగం విజయవంతం చేస్తూ ఇస్రో దేశానికే గర్వకారణంగా మారిందని కొనియాడారు. భవిష్యత్‌లోనూ ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఇది జాతి గర్వించదగ్గ విజయమని కొనియాడారు. ఇందుకు కృషిచేసిన ఇస్రో బృందాన్ని కూడా సీఎం అభినందించారు. వరుస విజయాలతో ఇస్రో ముందుకెళ్ళడం అమోఘమన్నారు. అలాగే పోర్చిగల్‌కు చెందిన వరల్డ్ ప్రెస్ కార్టూన్ సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచస్థాయిలో ఉత్తమ ఎడిటోరియల్ కార్టూన్లు, క్యారికేచర్లకు ప్రకటించే గ్రాండ్ ప్రిక్స్ అవార్డు ఈ ఏడాది తెలంగాణ రాష్టాన్రికి చెందిన ప్రముఖ కార్టూనిస్ట్ పామర్తి శంకర్‌కు దక్కింది. ఈ అవార్డు శంకర్‌కు దక్కడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తంచేశారు. గ్రాండ్ ప్రిక్స్ అవార్డు ఆసియాకు చెందిన వారికి దక్కడం ఇది తొలిసారి కావడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి పామర్తి శంకర్‌ను అభినందించారు. అన్ని రంగాల్లో తెలంగాణకు చెందిన వ్యక్తులు అత్యున్నత స్థాయిలో రాణించాలని సీఎం ఆకాంక్షించారు.





