Tuesday, 3 November 2026

తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు

AND_0032
సర్కారు విజ్ఞప్తికి సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ దత్తు సానుకూల స్పందన

గవర్నర్‌తో భేటీ అయి చర్చించిన కేసీఆర్‌

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 16 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటుచేసేందుకు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ దత్తు సానుకూలంగా స్పందించారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చందశ్రేఖర్‌రావు ఢిల్లీ పర్యటనలో ప్రత్యేక హైకోర్టు అంశాన్ని లేవనెత్తిన సంగతి తెలిసిందే. సర్కారు విజ్ఞప్తితో ఏకీభవించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఏర్పాటుకు సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో న్యాయ శాఖ విభజనకు రంగం సిద్ధమవుతోంది. ఉన్నత న్యాయస్థానం విభజనకు మార్గం సుగమమవుతోంది. త్వరలోనే తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కానుంది. హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి పరదా ప్యాలెస్‌ లేదా ఎర్రమంజిల్‌ ఆర్‌అండ్‌బీ భవనంలో తెలంగాణ హైకోర్టు ఏర్పాటయ్యే అవకాశముంది. లేక ప్రస్తుతం ఉన్న హైకోర్టులోనే రెండు రాష్టాల్రకు వేర్వేరుగా ఉన్నత న్యాయస్థానాలు ఏర్పాటయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్టాన్రికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తు సుముఖత వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఢిల్లీలో కలిశారు. తెలంగాణలో ప్రత్యేక హైకోర్టు గురించి చర్చించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ప్రస్తుతం ఉన్న హైకోర్టును విభజించి, రెండు రాష్టాల్రకు వేర్వేరుగా ఏర్పాటు చేయాల్సి ఉన్న నేపథ్యంలో.. హైకోర్టు విభజనకు అంగీకరించాలని రాజీవ్‌ శర్మ ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఈ అంశంపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు కూడా ప్రధాన న్యాయమూర్తితో చర్చించారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని చీఫ్‌ జస్టిస్‌తో పాటు కేంద్ర న్యాయ శాఖ మంత్రిని పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో వీలైనంత త్వరగా న్యాయ శాఖను కూడా విభజించాలని విన్నవించారు. తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎస్‌ రాజీవ్‌ శర్మ చీఫ్‌ జస్టిస్‌తో సమావేశమయ్యారు. హైకోర్టు విభజన అంశాన్ని త్వరగా తేల్చాలని విన్నవించారు. దీంతో తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసేందుకు జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తు సుముఖత వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా హైకోర్టు విభజనకు చర్యలు తీసుకుంటామని ఆయన సీఎస్‌కు హావిూ ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రత్యేక హైకోర్టు త్వరలోనే ఏర్పాటు కానుంది. కింగ్‌కోఠిలోని పరదా ప్యాలెస్‌ లేదా ఎర్రమంజిల్‌లోని ఆర్‌అండ్‌బీ భవనంలో తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుత హైకోర్టు భవనాన్ని తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం.

గవర్నర్‌ నరసింహన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గురువారం రాజ్‌భవన్‌లో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సుమారు రెండు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. వివిధ అంశాలపై చర్చలు జరిపినట్లు తెలియవచ్చింది. ఈ భేటీలో ప్రధానంగా బడ్జెట్‌ సమావేశాలు నవంబర్‌ మొదటి వారంలో ప్రారంభం కానున్న నేపథ్యంలో తేదీల ఖరారుకు సంబంధించి మర్యాద పూర్వకంగా కేసీఆర్‌ గవర్నర్‌ను కలిసినట్టుగా సమాచారం. అలాగే  తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం దానికి సంబంధించిన ఫైల్‌ గవర్నర్‌ స్థాయికి పంపించినట్లుగా తెలియవచ్చింది. వీటన్నింటిపై చర్చలు జరిపేందుకే నరసింహన్‌తో సమావేశం అయినట్లుగా తెలుస్తోంది. ఇంకా హైకోర్టు విభజన జరపాలని టీ. ప్రభుత్వం కోరుకుంటోంది. ఈ అంశం కూడా కేసీఆర్‌ గవర్నర్‌ దృష్టికి తీసుకువెళ్లినట్టుగా సమాచారం. రాష్ట్రంలో వివిధ సమస్యలు తదితర అంశాలు కూడా చర్చకు వచ్చి ఉంటాయని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *