Tuesday, 3 November 2026

మాతో పెట్టుకోకు చైనాకు రాజ్‌నాథ్‌ హెచ్చరిక

Rajnath-Singh_20141016
గుర్గావ్‌, అక్టోబర్‌ 16 (జనంసాక్షి) : భారత్‌తో పెట్టుకోవద్దని కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హెచ్చరించారు. భారతదేశానికి ఎవరూ హెచ్చరికలు చేయలేరని ఆయన స్పష్టంచేశారు. భారత్‌ చాలా శక్తివంతమైన దేశమని అన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌ ప్రాంతంలో సరిహద్దు వద్ద భారత్‌ రోడ్డు వేస్తుండడంపై చైనా అభ్యంతరం చెప్పడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ‘ఈ రోజు మనను ఎవరూ హెచ్చరించలేరు. భారత్‌ చాలా శక్తివంతమైన దేశమని’ వ్యాఖ్యానించారు. గురువారం మానెసర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ¬ం మంత్రి.. రోడ్డు నిర్మాణంలో చైనా అభ్యంతరాలపై స్పందించారు. మెక్‌మోహన్‌ రేఖ వెంబడి భారత్‌ రహదారి నిర్మిస్తుండడాన్ని చైనా తప్పుబడుతోంది. దీనిపై విలేకరులు ¬ం మంత్రిని ప్రశ్నించగా.. ఆయన ఘాటుగా స్పందించారు. ‘చైనా-భారత్‌ సరిహద్దుల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. సమస్యాత్మక అంశాలు పరిష్కారమైన తర్వాతే భారత్‌ ముందడుగు వేస్తుంది. సమస్యను జఠిలం చేయబోదని ఆశిస్తున్నట్లు’ చైనా చేసిన వ్యాఖ్యలపై రాజ్‌నాథ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. సరిహద్దు సమస్యలను కూర్చొని చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. సరిహద్దుల్లో ప్రధానంగా అరుణాచల్‌ప్రదేశ్‌, జమ్మూకాశ్మీర్‌లలో మౌలిక వసతులు మెరుగు పరిచేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *