రైతులు ఆందోళన చెందొద్దు
తెలంగాణ సర్కారు
హైదరాబాద్, అక్టోబర్ 16 (జనంసాక్షి) : విద్యుత్ సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. డిమాండ్ మేరకు బహిరంగ మార్కెట్లో కరెంటు కొంటున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. రైతులు ఆందోళన చెందవద్దని సూచించింది. ఇప్పటివరకు యూనిట్ రూ.8.03చొప్పున 132 మిలియన్ యూనిట్లు కొన్నామని, వర్షాభావం, బోరుబావులు విద్యుత్ డిమాండ్‌కు కారణమని సీఎంవో తెలిపింది. విద్యుత్ డిమాండ్ 180 మిలియన్ యూనిట్లు చేరుకుందని, పవర్ ఎక్చ్సేంజ్ వద్ద ఉన్న కరెంటును ఎంతధరకైనా కొంటామని సీఎంవో పేర్కొంది. రోజుకు సగటున 164 మిలియన్‌యూనిట్ల డిమాండ్ ఉండగా, ప్రభుత్వం 141 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరాచేస్తోందని తెలిపింది. సింహాద్రి ప్రాజెక్టు నుంచి 800 మెగావాట్ల విద్యుత్ రావడం లేదని సీఎంవో పేర్కొంది.రాష్ట్రంలో ఉన్న డిమాండ్ మేరకు విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. డిమాండ్ మేరకు బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ను కొంటున్నామని ఒక ప్రకటనలో పేర్కొంది. పవర్ ఎక్చేంజ్ వద్ద ఉన్న కరెంట్‌ను ఎంత ధరకైనా కొంటామని సీఎంవో పేర్కొంది. రోజుకు సగటున 164 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా, ప్రభుత్వం 141 మిలియన్ యూనిట్లు విద్యుత్ సరఫరా చేస్తోందని తెలిపింది. సింహాద్రి ప్రాజెక్టు నుంచి 800 మెగావాట్ల విద్యుత్ రావడంలేదని సీఎంవో పేర్కొంది.





