‘నిర్భయ్’ ప్రయోగం విజయవంతం
చాందీపూర్, అక్టోబర్ 17 (జనంసాక్షి) :
‘నిర్భయ్’ ప్రయోగం విజయవంతమైంది. భారత అ మ్ముల పొదిలో మరో బ్రహ్మాస్త్రం చేరింది. పూర్తి స్వ దేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నిర్భయ్ క్షిపణి పరీ క్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్ సవిూ పంలో శుక్రవారం నిర్భయ్‌ను పరీక్షించారు. రెండో విడత పరీక్షలోనూ నిర్భయ్ నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఈ క్షిపణి 850 కిలోవిూటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగలదు. తక్కువ ఎత్తులో ఎగురుతూ లక్ష్యాన్ని ఛేదించగల నిర్భయ్ రాడార్లకు చిక్కకుడా తన పనిని పూర్తిచేయగలదు. క్షిపణుల దాడిని తప్పించుకొని లక్ష్యాలను ఛేదించడం నిర్భయ్ ప్రత్యేకత అని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘నిర్భయ్ క్షిపణి ప్రయోగం విజయవంతమైందని’ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. రాడార్‌లకు చిక్కకుండా తక్కువ ఎత్తులో ఎగురుతూ లక్ష్యాలను ఛేదించడంలో ఇది సఫలమైందని పేర్కొన్నారు. బాలాసోర్ నుంచి రెండోసారి ప్రయోగించిన నిర్భయ్ విజయవంతమైంది. గతేడాది మార్చి 12న ఈ క్షిపణిని తొలిసారి ప్రయోగించారు. అయితే, అప్పుడు అది పూర్తి స్థాయి విజయవంతం కాలేదు. రెండోవిడత పరీక్షలో మాత్రం నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. భారత్ రూపొందించిన బ్ర¬్మస్ కంటే నిర్భయ్ చాలా శక్తివంతమైనది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన బ్ర¬్మస్ క్షిపణి 290 కిలో విూటర్ల లక్ష్యాన్నే ఛేదించగలదు. కానీ, నిర్భయ్ మాత్రం దాదాపు వెయ్యి కిలో విూటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదిస్తుంది.





