
న్యూఢిల్లీ, అక్టోబర్ 20 (జనంసాక్షి) :
బంగారం దిగుమతిపై కేంద్రం మరిన్ని ఆంక్షలు విధించనుంది. దీపావళి పండుగ తర్వాత ఈ విషయంపై దృష్టిసారించన్నుట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. బంగారం దిగుమతులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. దీపావళి సీజన్ సందర్భంగా ఎలాంటి చర్యలూ తీసు కోబోమని, పండుగ తర్వాత నిర్ణయం తీసు కుంటామని జైట్లీ చెప్పారు. పండుగ వేళ ప్రభుత్వం ఈ నిర్ణయం
తీసుకోవడ పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా పండుగ వేళ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల పలువురు వినియోగదారులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. కొందరు భారత వ్యాపారుల ఒత్తిడి వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.




