Tuesday, 3 November 2026

అడుగడుగునా ‘బాబు’ వంచన

etela
తెలంగాణ కరెంటు కష్టాలకు ఆయనే కారణం

మంత్రి ఈటెల రాజేందర్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌ 21 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమం త్రి నారా చంద్రబాబునాయుడు అడుగడుగునా వంచనకు గురిచేస్తున్నాడని తె లంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ ఆరోపించారు. తెలంగాణలో కరెంటు కష్టాలకు చంద్రబాబే కారణమని స్పష్టంచేశారు. తెలంగాణకు రావాల్సి న విద్యుత్‌ను రాకుండా ఆయనే అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగింపుపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు చంద్రబాబు ఫిర్యాదు చేయడంపై ఈటెల తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకవైపు విద్యుత్‌ లేకుండా పంటలు ఎండిపోతుంటే తమకు రావాల్సిన విద్యుత్‌ వాటా రాకుండా అడుగడుగునా చంద్రబాబు అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. విూకు ఒక న్యా యం.. మాకు ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో రాసుకున్న అన్ని ఒప్పందాలను చంద్రబాబు కాలరాస్తున్నాడని ధ్వజమెత్తారు. మంగళవారం టీఆర్‌ఎస్‌ రాష్ట్ర పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఈటెల విూడియాతో మాట్లాడారు. తెలంగాణలో కరెంట్‌ కష్టాలకు చంద్రబాబే కారణమన్నారు. శ్రీశైలం, ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రంలో, నాగార్జునసాగర్‌లోనూ విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేయాలని చంద్రబాబు కృష్ణా, గోదావరి వాటర్‌ బోర్డులకు లేఖ రాయడం దారుణమన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు 54, ఆంధ్రకు 46 శాతం విద్యుత్‌ పంపిణీ జరిగిందని గుర్తుచేసిన ఈటెల.. ఆ మేరకు కరెంట్‌ ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నాడని విమర్శించారు. ‘నిబంధనల ప్రకారం తెలంగాణకు 54 శాతం కరెంట్‌ ఇవ్వాలి. కానీ ఇవ్వకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. పీపీఏల రద్దు నుంచి చంద్రబాబువి అన్నీ కుట్రలే. తెలంగాణ ప్రజలు, రైతాంగంపై పగ సాధిస్తున్నాడు. తెలంగాణ నీళ్లు, కరెంటు వాడుకుంటూ ద్రోహం తలపెడుతున్నాడని’ నిప్పులు చెరిగారు.ఆంధ్రబాబు తెలంగాణకు అడుగడుగునా మోసం చేస్తున్నాడని ఈటెల మండిపడ్డారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు లేఖ రాయడం, అలాగే, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేయాలని కోరడం వంటి చర్యలన్నీ బాబు తెలంగాణపై కక్షసాధింపులో భాగమేనన్నారు. విద్యుత్‌ సమస్యను ఎదుర్కొంటున్న తెలంగాణకు ఆయన రాసిన లేఖ పుండు విూద కారం చల్లినట్లుగా ఉందని తెలిపారు. తెలంగాణకు ఇంత ద్రోహం చేస్తున్నా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు నోరుమెదపక పోవడం దారుణమన్నారు. వారిని చరిత్ర క్షమించదని తెలిపారు. తెలంగాణకు ద్రోహం చేస్తున్నా టీ-టీడీపీ నేతలు మాత్రం బాబుకు చెక్కభజన చేస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆరోపించారు. కరెంట్‌పై రాద్దాంతం చేస్తున్న టీడీపీ నేతలు చంద్రబాబు వద్దకు వెళ్లి నిలదీయాలని సూచించారు. శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పత్తిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాద్ధాంతం చేయడంపై మంత్రి మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు లోబడే విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుందని ఈటెల వివరణ ఇచ్చారు. ప్రస్తుతం 166మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ ఉంటే, 143 యూనిట్లు మాత్రమే సరఫరాకు అందుబాటులో ఉందన్నారు. ఇప్పటికే 23 మిలియన్‌ యూనిట్ల కొరత ఉంటే విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేసి సమస్యలు సృష్టించడమే కాకుండా నదీ యాజమాన్య బోర్డులకు లేఖ రాయడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. బడ్జెట్‌లో మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ ఫండ్‌ను ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు. ప్రజలు మెచ్చేవిధంగా బడ్జెట్‌ ఉంటుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *