రోడ్డెక్కిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
నల్గొండలో టీడీపీ కార్యాలయానికి నిప్పు
హైదరాబాద్, అక్టోబర్ 21 (జనంసాక్షి) :
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయా లని కృష్ణానది యాజమన్య బోర్డుకు ఆంద్ర óప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేఖరాయడంపై తెలంగాణ రాష్ట్రం భగ్గు మంది. తెలంగాణకు కరెంటు వద్దంటావా? అని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. నల్గొండలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు టీడీపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు. మంగళవారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రోడ్డెక్కి తమ నిరసన తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ‘శ్రీశైలం’ చిచ్చురాజుకుంది. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగింపుపై రెండు రాష్టాల్ర మధ్యవివాదం నెలకొంది. శ్రీశైలంలో నీటిమట్టం క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఏపీ సర్కారు కోరుతుండగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ దృష్ట్యా ఉత్పత్తిని నిలిపివేసే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలంటూ ఏపీ సర్కారు కృష్ణా నదీ యాజామన్య బోర్డుకు ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత ముదిరింది. రాష్ట్రంలో తీవ్ర కరెంట్ కొరత నేపథ్యంలో చంద్రబాబు కావాలనే తమను ఇబ్బందులకు గురిచేసేందుకు కుట్రలు పన్నుతున్నాడని తెలంగాణ ప్రభుత్వం మండిపడుతోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణను దెబ్బతీయాలనే లక్ష్యంతోనే విద్యుత్ వాటా ఇవ్వడం లేదని, పైగా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసేలా యత్నిస్తున్నారని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. ఒకవైపు విద్యుత్ లేకుండా పంటలు ఎండిపోతుంటే తమకు రావాల్సిన విద్యుత్ వాటా రాకుండా అడుగడుగునా చంద్రబాబు అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం ఈటెల విూడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కరెంట్ కష్టాలకు చంద్రబాబే కారణమన్నారు. శ్రీశైలం, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో, నాగార్జునసాగర్‌లోనూ విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని చంద్రబాబు కృష్ణా,గోదావరి వాటర్ బోర్డులకు లేఖ రాయడం దారుణమన్నారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిపైఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాద్దాంతం చేయడంపై మంత్రి మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంనిబంధనలకు లోబడే విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని ఈటెల వివరణ ఇచ్చారు. ప్రస్తుతం 166మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే, 143యూనిట్లు మాత్రమే సరఫరాకు అందుబాటులోఉందన్నారు. చంద్రబాబు వ్యవహారం దొంగే దొంగ దొంగ.. అన్నట్లు ఉందని మంత్రి జగదీశ్వర్‌రెడ్డిమండిపడ్డారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని చంద్రబాబు కృష్ణా ట్రైబ్యునల్‌కు లేఖరాయడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు చంద్రబాబు, బీజేపీలే కారణమని ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు ధర్నాలు పేరుతో బాబుకు వత్తాసుపలుకుతున్నారని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ నేతలు విద్యుత్ కోసం రాష్ట్రంలో కాకుండాప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చంద్రబాబుల ఇంటి ముందు ధర్నా చేయాలని సూచించారు.తెలంగాణ స్వయం ప్రతిపత్తిని గౌరవించకుండా బాబు కుట్రచేస్తున్నాడని మండిపడ్డారు. మరోవైపు శ్రీశైలంలో నీటిమట్టం తగ్గిపోతుండడంతో విద్యుత్ ఉత్పత్తిని వెంటనే నిలిపివేయాలని ఏపీసర్కారు పట్టుబడుతోంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో కృష్ణానదీ యాజమన్య బోర్డుకు లేఖ రాసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు బోర్డు చైర్మన్ కృష్ణపండిట్‌కు లేఖ రాశారు. ప్రాజెక్టులో కనసీ నీటిమట్టం 854 అడుగులు కొనసాగించాల్సి ఉందని,అయితే, ఈ ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఫిర్యాదు. చేశారు. దీనిపైతెలంగాణ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు తీరును నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంగళవారం ట్యాంక్‌బండ్‌పై ధర్నాకు దిగారు.





