Tuesday, 3 November 2026

ఇది చారిత్రాత్మక నిర్ణయం ఫ్రెండ్లీ గవర్నమెంట్‌

devi

సర్కారుతో ఉద్యోగులు సహకరిస్తారు

టీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌ 21 (జనంసాక్షి) :

ఉద్యోగుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని టీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు దే వీప్రసాద్‌ అన్నారు. ప్రస్తుతమున్నది ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ అని అన్నారు. సర్కారుతో ఉద్యోగులు సహకరిస్తారని తెలిపా రు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నగదురహిత, పరిమితిలేని వైద్యసేవలు అందించడానికి ‘ఆరోగ్య కార్డులు’ ఇవ్వడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపినట్లు ఆయన చెప్పారు. మంగళవారం ఉదయం దేవీప్రసాద్‌, తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రితో చర్చలు జరిపిన తర్వాత సీఎం ఈ ప్రకటన చేశారు. గతంలో ప్రభుత్వాలు హెల్త్‌కార్డులు జారీచేయకుండా అనేక ప్రతిబంధకాలు సృష్టించి ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా కార్టులు జారీచేయడానికి ప్రయత్నించాయన్నారు. అనేక సమావేశాలు నిర్వహించినా ఎలాంటి ఫలితం లేకపోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి వాగ్దానం చేసినట్లుగానే ఉద్యోగులకు పరిమితిలేని, నగదురహిత వైద్యసేవలు అందించడానికి తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాలనాయకులు, పెన్షనర్లు హర్షం వ్యక్తంచేస్తున్నారు. టీఎన్‌జీఓ భవన్‌లో బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకొని ఉద్యోగులు ఆనందం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని మరోసారి నిరూపితమైందన్నారు. కేసీఆర్‌కు ఈ సందర్భంగా ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోని ఉద్యోగులందరూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చడంలో విరామం లేకుండా పనిచేస్తామన్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి నిర్దేశించిన ప్రకారం లక్ష్యాలు పూర్తిచేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌జీఓ ప్రధాన కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, నాయకులు బి.,రేచర్‌, ప్రతాప్‌, కొండల్‌రెడ్డి, హరిబాబు, వేణుగోపాల్‌, విజయలక్ష్మీ, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు ముజీబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *