Tuesday, 3 November 2026

తెలంగాణ రెగ్యులేటరీ కమిషన్‌ ఏర్పాటు

regulater

ఛైర్‌పర్సన్‌గా ఇస్మాయిల్‌ అలీఖాన్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌ 21 (జనంసాక్షి) :

తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ను ఏర్పాటుచేస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మం గళవారం నిర్ణయం తీసుకున్నారు. కమిషన్‌ ఛైర్‌ప ర్సన్‌గా ఆదిలాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌కు చెందిన ఇస్మా యిల్‌ అలీఖాన్‌ను నియమించారు. మగ్గురు సభ్యుల కమిషన్‌ త్వరలో ప్రమాణ స్వీకారంచేసి బాధ్యతలు స్వీకరిస్తుంది. అలీఖాన్‌ ప్రస్తుతం బీహార్‌ స్టేట్‌ ఎలక్ట్రి సిటీ రెగ్యులేటరీ కమిషన్‌ సభ్యునిగా పనిచేస్తున్నారు. గతంలో ప్లానింగ్‌ కమిషన్‌ సభ్యునిగా పనిచేశారు. ఈఆర్‌సి సభ్యులుగా ఎల్‌.మనోహర్‌రెడ్డి, హెచ్‌.శ్రీనివాసులను నియమిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మనోహర్‌రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ఈఆర్‌సి డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. గతంలో ట్రాన్స్‌కో సీఈగా పనిచేశారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన శ్రీనివాసులు ప్రస్తుతం అమెరికాకు చెందిన డెలాయిట్‌ కంపెనీకి సలహాదారుడిగా పనిచేస్తున్నారు. గతంలో ఇన్‌కంట్యాక్స్‌ కమిషనర్‌గా పనిచేశారు.

ఆ త్యాగాలు అమూల్యం

పోలీస్‌ అమరవీరులకు సీఎం ఘననివాళి

మృతవీరుల కుటుంబాలకు భారీగా ఎక్స్‌గ్రేషియా పెంపు

ఎస్‌ఐలకు ఇక గజిటెడ్‌ ¬దా

పోలీసులకు వరాల జల్లు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 21 (జనంసాక్షి) :

పోలీసుల త్యాగాలు అమూల్యమైనవని తెలంగా ణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొనియాడా రు. పోలీస్‌ అమరవీరులకు ఆయన ఘననివాళి అర్పించారు. మంగళవారం గోషామహల్‌లోని శివకుమార్‌లాల్‌ పోలీస్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్స వానికి గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీ జీపీ అనురాగ్‌ శర్మ, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేసీఆర్‌ ప్రసంగిస్తూ.. పోలీసు సేవలను కొనియాడారు. పోలీసులపై వరాలజ ల్లు కురిపించారు. మృతవీరుల కుటుంబాలకు భారీగా ఎక్స్‌గ్రేషియా పెంచనున్నట్లు ప్రకటిం చారు. అలాగే ఎస్‌ఐలకు గజిటెడ్‌ హోదా కల్పి స్తున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని.. వారి కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే ఎక్స్‌గ్రే షియా భారీగా పెంచుతున్నట్లు కేసీఆర్‌ తెలిపా రు. పోలీసు అమరుల త్యాగాలు అమూల్యమై నవి, వెలకట్టలేనివని అన్నారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేమని తెలిపారు. శాం తిభద్రతల రక్షణలో వారి సేవలు నిరూపమాన మన్నారు. ఏటా అమరులను స్మరించుకోవడం మంచి సంప్రదాయమని తెలిపారు. విూడియా, సినిమా వాళ్లు పోలీసులను కించపరిచేలా చూడ టం, మాట్లాడడం తగదని హితవు పలికారు. విధ నిర్వహణలో అమరులైన వారు దేవునితో సమానమని వ్యాఖ్యానించిన కేసీఆర్‌.. అమరుల కుటుంబాలకు వంద శాతం అండగా ఉంటా మని హావిూ ఇచ్చారు. అమరుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను భారీగా పెంచుతున్నట్లు వెల్లడించారు. విధి నిర్వహణలో కానిస్టేబుల్‌ ఆపై స్థాయి సిబ్బంది మరణిస్తే ఇప్పుడు ఇస్తున్న రూ.25 లక్షల పరిహారాన్ని రూ.40 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులకు రూ.30 లక్షల నుంచి రూ.45 లక్షలు,చ డీఎస్పీ స్థాయి అధికారికి రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలు, ఐపీఎస్‌ అధికారులకు రూ.50లక్షల నుంచి రూ.కోటి పరిహారం పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కానిస్టేబుళ్లుకు రోజువారి చెల్లిస్తున్న జీతం రూ.90 నుంచి రూ.250కి పెంచుతున్నట్లు తెలిపారు. ఆరోగ్య భద్రత కింద ప్రస్తుతం ఉన్న రూ.లక్షను రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు చెప్పారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుండేది పోలీసులేనని కేసీఆర్‌ అన్నారు. పోలీసు వ్యవస్థను చెడుగా చూడటం దేశానికే మంచిది కాదని చెప్పారు. భద్రత ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, సింగపూర్‌ తరహాలో భద్రతను మరింత పటిష్టం చేస్తామని స్పష్టంచేశారు. ధన, మాన, ప్రాణ రక్షణలో పోలీసులు విజయం సాధించాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. సమాచార వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు. కానిస్టేబుల్‌ నుంచి డీజీపీ వరకు సీయూజీ ఫోన్లు ఇస్తామని చెప్పారు. పోలీసులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని హావిూ ఇచ్చారు. ఎస్సైలకు గెజిటెడ్‌ ¬దా కల్పిస్తామని ప్రకటించారు. సంఘ విద్రోహ శక్తుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు వంద శాతం పరిహారం అందిస్తామన్నారు. ప్రతిభ కనబరిచిన 20మంది పోలీసులకు మెడల్స్‌, రూ.5 లక్షల ప్రోత్సాహం ఇస్తామని తెలిపారు. అయితే, ¬ంగార్డుల జీతభత్యాలపై ముఖ్యమంత్రి ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై సంస్మరణ సభలో ¬ంగార్డులు నిరసన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *