Monday, 2 November 2026

స్వచ్ఛ్‌ భారత్‌లో మేరీకోమ్‌

merikom
ఇంఫాల్‌, అక్టోబర్‌ 24 (జనంసాక్షి) :
మేరీకోమ్‌ స్వచ్ఛ్‌ భారత్‌లో పాల్గొన్నారు. భారత స్టార్‌ బాక్సర్‌, ఒలింపిక్‌ పతక విజేత మేరీకోమ్‌ స్వచ్ఛభారత్‌లో భాగంగా మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో శుక్రవారం రోడ్లు వూడ్చి శుభ్రం చేశారు. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ స్పందిస్తూ మేరీకోమ్‌ స్వచ్ఛభారత్‌లో పాల్గొనడం ప్రజల్లో ఉత్తేజాన్ని నింపుతుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆమెను మోదీ ఈ సందర్భంగా అభినందించారు. గాంధీజయంతి రోజున పరిశుభ్రభారత్‌ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్‌ అంబానీ స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొనాలని మేరీకోమ్‌ను ప్రతిపాదించారు. ఆయన ఆహ్వానం మేరకు మేరీకోమ్‌ ఈరోజు స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిశుభ్ర భారత్‌ కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి అనిల్‌ అంబానీ తనను ప్రతిపాదించడం ఆనందంగా ఉందని మేరీకోమ్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *