Monday, 2 November 2026

మహరాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నావీస్‌కే మొగ్గు

maharastra

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 24 (జనంసాక్షి) :

మహరాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నావీస్‌కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మ హారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పా టుకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది.ముఖ్యమంత్రి అభ్యర్థిపై స్పష్టం వచ్చినందున మం త్రి వర్గం కూర్పు, పదవుల పంపిణీలపై దృష్టి సారించింది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ ఎన్నిక దాదాపుగా ఖరారు అయినట్లు తెలియవచ్చింది. మరోవైపు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాక్రే ఆదివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం. మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక అయిన బీజేపీ శాసనసభ్యుల సమావేశం సోమవారం జరగనుంది. ఆ సమావేశంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అధికారికంగా ఎన్నుకుంటారు. ప్రమాణస్వీకారం తేదీ, సమయం కూడా ఆ భేటీలోనే నిర్ధారిస్తారు. ఏది ఏమైనా వచ్చే వారమే మహారాష్ట్ర శాసనసభలో బీజేపీ ప్రభుత్వం కొలువుతీరనుంది. అక్టోబర్‌ 29 లేదా 30న ముఖ్యమంత్రి, మరికొందరు మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం. దక్షిణ ముంబైలోని బహిరంగ మైదానంలో ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది. మొదట సీఎంతో పాటు 20 నుంచి 24 మంది మంత్రులు ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. శాసనసభలో బలనీరూపణ తర్వాత మంత్రి వర్గాన్ని విస్తరిస్తారని తెలియవచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *