రెచ్చగొడితే ఊరుకోం
కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్
న్యూఢిల్లీ, అక్టోబర్ 24 (జనంసాక్షి) :
‘మేం శాంతికాముకులం.. రెచ్చగొడితే ఊరు కోబోం’ అని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నా త్‌సింగ్ హెచ్చరించారు. సరిహద్దు దేశాలతో భారత్ శాంతిని కోరుకుంటుందని రాజ్‌నాథ్ తెలిపారు. అయితే సరిహద్దుల్లో హద్దువిూరితే ఊరుకునేది లేదన్నారు. ఐటీబీపీ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న రాజ్‌నాథ్ మాట్లా డుతూ… పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లం ఘనలను ఆపాలన్నారు. చైనాతో సరిహద్దు సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుంటా మన్నారు. దేశ భద్రత కోసం ప్రాణాలర్పించిన సైనికులందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్ననని ప్రకటించారు. ఆత్మగౌరవం మానవ జీవితం లో అత్యంత ప్రధానమైంది. మన జీవితంలో ఆకలితో ఉండొచ్చు. కానీ ఆత్మగౌరవం విషయంలో రాజీ పడలేమని స్పష్టం చేశారు. . ప్రపంచంలో ఏ శక్తయినా భారత్‌పై బలప్రయోగానికి యత్నిస్తే దేశ ప్రజలంతా భేద భావాలన్నింటినీ మరచి శత్రువు కుట్రలు తిప్పికొట్టడంలో సైనికులకు వెన్నుదన్నుగా నిలుస్తారనే విషయం మరవద్దని ఆయన పేర్కొన్నారు. భారత్ తనకుతానుగా ఏనాడూ ఎవరిపైనా దాదికి దిగలేదన్నారు. అయితే శతృవుఉల దాడి చేస్తే గట్టిగా బుద్ది చెబుతామన్నారు. కాల్పుల విరమణ ఉల్లంఘనలను పాక్ ఆపాలని డిమాండ్ చేశారు. చెయనాతో సరిహద్దు సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. సరిహద్దులో శాంతిని కోరుకుంటున్నామని వివరించారు.





