
న్యూఢిల్లీ, అక్టోబర్ 24 (జనంసాక్షి) : ఢిల్లీలోని శాస్త్రి పార్క్ స విూపంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాగ్ వద్ద ఉన్న మురికి వాడల్లో మంటలు చెలరేగాయి. వందల సంఖ్యలో పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక బృందాలు హుటాహుటిన సంఘటనా ప్రదేశానికి చేరుకున్నాయి. మొత్తం 1 అగ్నిమాపక శకటాలు మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేసాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చునని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీపావళి కావడంతో బాణాసంచా తగిలి ప్రమాదం జరిగి ఉండవచ్చునని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రోజువారి కూలి చేసుకునే నిరుపేదలు ఇళ్లుతగులబడిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో నష్టం కూడా భారీగానే ఉంటుందని భావిస్తున్నారు.
ఢిల్లీలో శాస్త్రిపార్కు సమీపంలో భారీ అగ్నిప్రమాదం




