Tuesday, 3 November 2026

ఆ వ్యక్తికి ఎబోలా లేదు

గాంధీ ఆస్పత్రి సూపరింటిండెంట్‌

హైదరాబద్‌, డిసెంబర్‌ 2 (జనంసాక్షి) : వ్యక్తికి ఎబోలా వైరస్‌ సోకలేదని గాంధీ ఆస్పత్రి సుపరింటిండెంట్‌ స్పష్టంచేశారు. నగరంలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన ఓ వ్యక్తికి అనుమానిత వైరస్‌ సోకింది. కొంతకాలంగా నైజీరియాలో పనిచేసిన ఆయన… ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చారు. ఇంట్లో ఉండగా తీవ్ర జ్వరం రావడంతో నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో గత నెల 24న చేరారు. అక్కడ రెండు రోజులు చికిత్స తీసుకున్నా నయం కాలేదు. దీంతో ఆయనకు స్వైన్‌ఫ్లొ లేదా ఎబోలా లక్షణాలు ఉండవచ్చని భావించి, అక్కడి నుంచి గాంధీకి తరలించారు.  గాంధీ ఆస్పత్రిలో నాలుగు రోజులుగా చికిత్స  అందిస్తున్నారు.  రక్త పరీక్షల్లో అనుమానిత వైరెస్‌ ను గుర్తించిన బయో కెమిస్ట్రీ విభాగం , రోగి రక్త నమూనాలను ఢిల్లీకి పంపారు.  దీనిపై సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ధైర్యవాన్‌ స్పందించారు.” కొత్త వైరస్‌ లక్షణాలతో ఓ వ్యక్తి చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 21న నైజీరియా నుంచి ఆ వ్యక్తి వచ్చాడు. వైరల్‌ ఫీవర్తో బాధపడుతున్నట్లు గుర్తించాం. నైజీరియాలో ఎబోలా ప్రభావం లేదు. పేషెంట్‌ పేరు, ఊరు, వ్యక్తిగత వివరాలు ప్రసారం చేయొద్దు.అనుమానంతో ఢిల్లీకి శాంపిల్స్‌ పంపాం. కొన్ని గంటల్లో రిపోర్టు వచ్చింది. ఆ పేషెంట్‌ కు ఎబోలా ఉన్నట్లు నిర్ధారణ కాలేదు. కేవలం నైజీరియా నుంచి వచ్చారు కాబట్టి…అనుమానంతో పరీక్షలు చేస్తున్నాం’ అని సూపరింటెండెంట్‌ విూడియాకు వివరించారు. ప్రపంచ దేశాలను అంతుచిక్కని ఎబోలా వైరెస్‌ వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఎటువంటి కొత్త రకం వైరెస్‌ ను గుర్తించినా, వివరాలను తమకు తెలియజేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల అన్ని దేశాలను కోరిన సంగతి తెలిసిందే.

2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *