Wednesday, 4 November 2026

ఢిల్లీ కొత్త సీఎం కేజ్రీవాల్‌కు ఆల్ ది బెస్ట్ : మమతా బెనర్జీ

mamatha

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు విజయాన్ని నమోదు చేసుకుని… ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుభాకాంక్షలు తెలిపారు. “ఢిల్లీ ఎన్నికలను స్వీప్ చేస్తున్న ఆప్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. కొత్త సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఆల్ ద బెస్ట్” అని తెలిపారు.
“ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు ఢిల్లీ ఎన్నికలు ఓ టర్నింగ్ పాయింట్. ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రతీకారానికి చోటు లేదని తెలుస్తోంది. దేశానికి ఇటువంటి మార్పే అవసరం. ఢిల్లీలో ఇది ప్రజల విజయం. అహంకారులకు, కక్షపూరిత రాజకీయాలు చేస్తున్న వారికి, ప్రజలలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న వారికి ఇది అతిపెద్ద పరాజయం” అని మమతా బెనర్జీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *