90స్థానాల్లో టీడీపీ, 60స్థానాల్లో బీజేపీ
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. తెలుగుదేశం 90 స్థానాల్లో, బీజేపీ 60 స్థానాల్లో పోటీ చేయనుంది. అయితే ఏ పార్టీ ఎక్కడి నుంచి నామినేషన్లు వేయాలనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. టీడీపీ పోటీచేయాలనుకుంటున్న స్థానాలనే బీజేపీ కోరుతుండటంతో.. చిక్కుముడి పడింది. దీంతో ఈ అంశంపై చర్చించేందుకు ఇరు పార్టీల నేతలు మధ్యాహ్నం భేటీ కానున్నారు. గ్రేటర్ నామినేషన్లకు రేపే ఆఖరు తేదీ కావడంతో…సాయంత్రానికి తొలి జాబితా విడుదల చేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు.