95వ రోజుకు చెరిన షర్మిల పాదయాత్ర

గుంటూరు : మరో ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్‌ షర్మిల చేపట్టిన పాదయాత్ర నేటికి 95వ రోజుకు చేరింది. మంగళవారం ఆమె మోపర్రు నుంచి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస& అభిమానులు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మాజరయ్యారు. షర్మిల పాదయాత్ర తురిమెల్ల మీదుగా అమృతలూరు చేరుకుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రజనుద్దేశించి మాట్లాడుతారు. ఆ తర్వాత పాదయాత్ర పెద్దపుడికి చేరుకుంటుంది. షర్మిల రాత్రి పెద్దపుడిలోని బస చేస్తారు.

తాజావార్తలు