Saturday, 7 November 2026

కరీంనగర్

ముళ్ల పోదల్లో చిన్నారి

మెట్‌పల్లి : నెలలు నిండని పసిపాపను ముళ్ల పోదల్లో కర్కశంగా పడేసిన సంఘటన మెట్‌పల్లి మండలంలో జరిగింది. సట్టణంలోని గాజులపేటలో ఉదయం చెట్ల పోదల్లోంచి ఓ పసిపాప ఏడుపు వినిపించడంతో చుట్టుపక్కల వారు గమనించి అపాపను బయటకు తీశారు.…

సీబీఐకి చిక్కిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి

కరీంనగర్‌: భవిష్యనిధి కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి లంచం తీసుకుంటూ సీబీఐకి దొరికాడు. రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ఆంజనేయులును సీబీఐ అధికారులు పట్టుకున్నారు. సీబీఐ అధికారులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

వేంపేట గ్రామంలో శ్రమదానం

  మెట్‌పల్లి గ్రామీణం : మండలంలోని వేంపేట గ్రామంలో సేనాభారతి, అర్‌ఎన్‌ఎన్‌ సభ్యులు శ్రమదానం చేశారు. స్థానిక రామాలయం నుంచి పెద్దమ్మగుడి వరకు రోడ్డుకు ఇరువైపుల ఉన్న పిచ్చి మొక్కలను తోలగించారు. విజయదశమి సందర్బంగా నవరాత్రి వేడుకల కోసం…

ఢీల్లీ వెళ్లి సూట్‌ కేసులతో వచ్చారు.

  కేసీఅర్‌ పై మాజీ ఎమ్మెల్సీ కోండా మురళి మంథని మూడు నెలల్లో తెలంగాణ తెస్తానంటూ కేసీఅర్‌ చేసిన ప్రగల్బాలు ఏమాయ్యయని మాజీ ఎమ్మెల్యే కోండా మురళి ప్రశ్నించారు, అదివారం మంథనిలో మాట్లాడుతూ అధిష్ఠానం పెద్దలతో చర్చలంటూ కేసీఅర్‌…

విష జ్వరంతో వ్యవసాయ అధికారి మృతి

  కాటారం (కరీంనగర్‌) : కాటారం మండలంలోని వ్యవసాయ శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్‌ విష జ్వరంతో మృతి చెందాడు. గత వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ వరంగల్‌లో చికిత్స పోందుతున్నప్పటికి అధికారికి నయం కాలేదు.…

ప్రేమతత్వాన్ని బోధించేదే భాగవతం

  జగిత్యాల (విద్యానగర్‌) : ప్రేమతత్వాన్ని బోధించేదే భాగవతమని సింహచలంలోని శ్రీవెంకటాచార్య వైదిక సంస్థాన్‌ ప్రవచకులు సాకులూరు గోపాలకృష్ణమాచార్య అన్నారు. శనివారం అయన జగిత్యాలలోని శ్రీవేణుగోపాలస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులతో అయన మాట్లాడుతూ శాంతియుతమైన జీవన విధానాన్ని…

తెలంగాణ మంత్రులకు చీరలు, గాజులతో నిరసన

  జగిత్యాల మండలం పాత బస్టాండులో తెరాస అధ్వర్యంలో తెలంగాణ వాదులు వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గాజులు, చీరలు, మల్లెపూల దండలను ప్రదర్శించి వీటిని తెలంగాణ మంత్రులకు పంచనున్నామని తెలిపారు. తెలంగాణ విషమంలో మంత్రుల చేతగానితనాన్ని తెలియజేప్పడానికి…

ఆజాద్‌పై ఎంపీ పొన్నం ఫైర్‌

కరీంనగర్‌: రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ గులాం నబీ ఆజాద్‌పై కాంగ్రెస్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. రాష్ట్ర విభజన అంత సులువు కాదన్న ఆజాద్‌, డిసెంబర్‌ 2009కి ముందు ఇదే మాటని ఎందుకు చెప్పలేదని పొన్నం ప్రశ్నించారు. ఒకసారి…

ఐటీఐలో అదనపు జేసీ విచారణ

పెద్దపల్లి: 2010-11 విద్యా సంవత్సరంలో బోగన్‌ కంపెనీల్లో శిక్షణ పొందినట్లు 250మంది అభ్యర్థులపై లోకాయుక్తలో చేసిన ఫిర్యాదు మేరకు ఈ రోజు అదనపు జేసీ  సుందర్‌ అబ్నార్‌ విచారణ నిర్వహించారు. వరంగల్‌ ఆర్‌డీడీ పెద్దపల్లి ఐటీఐ ప్రిన్సిపాల్‌లు కుమ్మక్కై…

అంతర్జాతీయ వికలాంగుల ఆరోగ్య దినోత్సవం

పెద్దపల్లి: అంతర్జాతీయ వికలాంగుల ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు స్థానిక స్పూర్తి మానసిక వికలాంగుల పాఠశాలలో పెద్దపల్లి మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ శ్రీ లేఖ పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.