Sunday, 15 November 2026

నల్లగొండ

ఇద్దరు యువకులను చితకబాదిన ఎస్సై

నల్లగొండ,(జనంసాక్షి): జల్లాలోని వలిగొంగలో ఇద్దరు యువకులను ఎస్సై చితకబాదారు. యువకుల పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. దీంతో పోలీస్‌స్టేషన్‌ ముందు బంధువులు ఆందోళన చేస్తున్నారు. ఆకారణంగా చితకబాదిన ఎస్సైని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌ వద్ద పరిస్థితి…

కిరణ్‌కు సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదు: ఎంపీ గుత్తా

నల్గొండ: తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల ప్రజల మధ్య సామరస్యం నెలకొల్పాల్సిన ముఖ్యమంత్రి రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డికి సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు.

ప్రభుత్వ బీసీ బాలికల వసతిగృహం ప్రారంభించిన చిరుమర్తి లింగయ్య

నకిరేకల్‌: పట్టణంలో ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాన్ని బుధవారం నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు. పట్టణంలోని ఎస్సీ బాలుర, ఎస్సీ బాలికల వసతి గృహాల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో…

సమాజ సేవలో యువత ముందుండాలన్న :శ్రీనివాసరావు

నల్గొండ అర్బన్‌: సమాజ సేవలో యువత ముందుండాలని నల్గొండ ట్రాఫిక్‌ సీఐ శ్రీనివాసరావు అన్నారు. సాయి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక న్యూ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

సీపీఐ- కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ

నల్లగొండ,(జనంసాక్షి): దేవరకొండ మండలం శేరిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సీపీఐ కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శేరిపల్లిలో పోలీసులను భారీగా మోహరించారు.

సెల్‌ఫోన్‌ పేలి విద్యార్థులకు గాయాలు

నల్లగొండ,(జనంసాక్షి): జిల్లాలోని మిర్యాలగూడలోని ప్రభుత్వ పాఠశాలలో సెల్‌ఫోన్‌ పేలి నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

కాంగ్రెస్‌, సీపీఐ నేతల మధ్య ఘర్షణ

నల్లగొండ,(జనంసాక్షి):చందంపేట మండలం ముడుగండ్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్‌, సీపీఐ నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా…

టీడీపీ, వైసీసీ కార్యకర్తల మధ్య ఘర్షణ

నల్లగొండ,(జనంసాక్షి): జిల్లాలోని మేళ్లచెర్వు మండలం హేమ్లాతండాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.

పోలింగ్‌ కేంద్రం వద్ద వృద్ధురాలి మృతి

నల్లగొండ,(జనంసాక్షి): జిల్లాలోని కనగల్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద విషాదం చోటు చేసుకుంది. ఓటు వేసి బయటకు వస్తుండగా ఓ వీద్ధురాలు గుండెపోటుతో మృతి చెందింది. వృద్ధురాలి  మృతితో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.

ఓటును చింపేసిన యువకుడు

నల్లగొండ,(జనంసాక్షి): జిల్లాలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటును జంపాని ప్రసాద్‌ అనే యువకుడు చింపేశాడు. ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రసాద్‌పై కేసు నమోదు  చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.