Sunday, 15 November 2026

నల్లగొండ

మిర్యాలగూడలో భారీ చోరి

నల్లగొండ,(జనంసాక్షి): మిర్యాలగూడ బండారిగడ్డలో భారీ చోరి జరిగింది. కారులో ఉంచిన రూ.20 లక్షల నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఏటీఎం చోరీకి దుండగుల విఫలయత్నం

నల్లగొండ,(జనంసాక్షి): చిట్యాలలోని ఎస్‌బీమెచ్‌ ఏటీఎంకు చోరీకి గుర్తు తెలియని దుండగులు విఫలయత్నం చేశారు. అక్కడ ఉన్న వాచ్‌మెన్‌ గమనించి కేకలు వేయడంతో దుండగులు పారిపోయినట్లు సమాచారం.

ఏసీబీ వలలో చిక్కిన ఆడిటింగ్‌ ఇన్‌స్పెక్టర్‌

నల్లగొండ,(జనంసాక్షి): జిల్లా కలెక్టరేట్‌ వక్ఫ్‌ బోర్డు కార్యాలయంలో ఆడిటింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు ఇన్‌స్పెక్టర్‌ను పట్టుకున్నారు. అనంతరం వక్స్‌ బోర్డు కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు…

సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలు ప్రారంభం

నల్లగొండ,(జనంసాక్షి):సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలు యాదగిరిగుట్లలో ప్రారంభమయ్యాయి. సమావేశానికి ముఖ్యఅతిథిగా సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ తెలంగాణ తప్ప మరో ప్రత్యామ్నాన్ని అంగీకరించమని తెలిపారు. ఎన్నికల తరువాత కేంద్రంలో కాంగ్రెసేతర,…

ప్యాకేజీలకు ఒప్పుకోం: కిషన్‌రెడ్డి

నల్లగొండ,(జనంసాక్షి): తెలంగాణ ఏర్పాటు తప్పా ప్యాకేజీలకు ఒప్పుకునేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలోని అలేరులో బీజేపీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి హాజరైన కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెడితే మద్దతిస్తామన్నారు.

10 ఏళ్ల బాలికపై యువకుడి అత్యాచారం

నల్లగొండ,(జనంసాక్షి): జిల్లాలోని చందంపేట మండలం ఎనమలమందలో దారుణ సంఘటన జరిగింది. 10 ఏళ్ల బాలికపై యువకుడు అత్యాచారం చేసిన ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి తల్లిదండ్రుల ఫర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు.

మోడల్‌ స్కూల్‌ను ప్రారంభించిన కేంద్రమంత్రి

నల్లగొండ,(జనంసాక్షి): జిల్లాలోని నడిగూడెం మండలం కర్విరాలలో మోడల్‌స్కూల్‌ను కేంద్రమంత్రి పల్లంరాజు ప్రారంభించారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులు పాల్గొన్నారు.

ప్యాకేజీలు ఊహాగానమే: మంత్రి ముఖేష్‌

నల్లగొండ,(జనంసాక్షి): తెలంగాణకు ప్యాకేజీలు కేటాయిస్తామని వస్తున్న వార్తలు ఊహాగానమే అని మంత్రి ముఖేష్‌గౌడ్‌ పేర్కొన్నారు. తెలంగాణ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.

పంచాయితీ రిజర్వేషన్లపై సీఎం, జానారెడ్డికి వీహెచ్‌ లేఖ

నల్లగొండ,(జనంసాక్షి): పంచాయితీ రిజర్వేషన్లపై సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి, మంత్రి జానారెడ్డి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు లేఖ రాశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. సీఎంకు, అడ్వకేట్‌ జనరల్‌కు మంచి…

అన్నదమ్ముల ప్రాణాలు బలికొన్న భూవివాదం

నల్లగొండ,(జనంసాక్షి): భూవివాదం ఇద్దరి ప్రాణాలను బలికింది. భూవివాదంలో ఇద్దరు అన్నదమ్ములను ప్రత్యర్థులు హత్య చేశారు. ఈ ఘటన మోత్కూర్‌ మండలం బుజిలాపురంలో చోటు చేసుకుంది. మృతులు ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని…