Tuesday, 10 November 2026

అంతర్జాతీయం

పాక్‌లో అమెరికా ఎయిర్‌ బాంబింగ్‌

తాలిబాన్‌ నం.2 వలి`ఉర్‌`రహ్మాన్‌తో సహా పలువురి మృతి ఇస్లామాబాద్‌,మే 29 (జనంసాక్షి) : తాలిబన్‌ అల్‌ఖైదా ఉగ్రవాదులకు స్వర్గధామంలా మారిన పాకిస్తాన్‌లోని ఉత్తర వాజిరిస్తాన్‌ గిరిజన  ప్రాంతంపై అమెరికా దృష్టిసారించిం ది. అమెరికాకు చెందిన సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ…

ఇటలీలో టోర్నడో విధ్వంసం

ఇటలీ : ఇటలీలోని మిలాస్‌ సమీపంలో టోర్నడో విధ్వంసం సృష్టించింది. శక్తివంతమైన ఈ టోర్నడో ధాటికి పలు ఇళ్లు , భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. అస్తినష్టం భారీగా జరిగినట్లు సమాచారం.

జపాన్‌ చక్రవర్తితో భేటీకానున్న ప్రధాని మన్మోహన్‌

టోక్యో, జనంసాక్షి: భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ జపాన్‌ చక్రవర్తి అఖిహితోతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక్ష సంబంధాలు, ఇతర అంశాలపై చర్చించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం మన్మోహన్‌ మంగళవారం జపాన్‌ వెళ్లిన విషయం…

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది మృతి

లక్నో : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎటా జిల్లాలో ఓ బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా.. 23 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అధికార యంత్రాంగం…

క్వెట్టాలో బాంబు పేలుడు:12మంది మృతి

పాకిస్థాన్‌ , జనంసాక్షి: పాకిస్థాన్‌లోని క్వెట్టాలో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 12 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

శ్రీనగర్‌లో లష్కరే తోయిబా తీవ్రవాది కాల్చివేత

శ్రీనగర్‌, జనంసాక్షి: జమ్మూకాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో గురువారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌ లష్కరే తోయిబాకు చెందిన ఓ తీవ్రవాదిని పోలీసులు కాల్చిచంపారు. ఈ సంఘటన శ్రీనగర్‌లోని నార్పరిస్తాన్‌ ప్రాంతంలో జరిగిందని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ…

చైనాలో పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో విస్ఫోటనం

బీజింగ్‌ : చైనాలో పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందగా, 19 మందికి తీవ్రగాయాలయ్యాయి. 20 మంది గల్లంతయ్యారు. గల్లంతైనవారి అచూకీకోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

ఆస్పత్రి నుంచి ఇంటికి చేరిన ఇమ్రాన్‌ఖాన్‌

లాహోర్‌ : పాకిస్థాన్‌కి చెందిన మాజీ క్రికెటర్‌, ప్రస్తుత రాజకీయవేత్త ఇమ్రాన్‌ఖాన్‌ ఈరోజు ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారు. మే 7 న ఎన్నికల ప్రచారంలో ఉండగా జరిగిన ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం…

ఘుజియాబాద్‌లో దుండగుల దాడి.. ఏడుగురి మృతి

లక్నో : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఘజియాబాద్‌ న్యూసిటీలో ఓ కుటుంబంపై మారణాయుధాలతో దుండగులు దాడికి దిగారు. ఈ దాడిలో ఆ కుటుంబంలోని ఏడుగురు మృతి చెందారు. ఆస్తి తగాదాలే ఈ ఘటనకు కారణమని బంధువులు అంటున్నారు. పోలీసులు ఘటనాస్థలికి…

పరాజయం పాలైన పాక్‌ ప్రముఖులు

ఇస్లామాబాద్‌, పాకిస్థాన్‌లో నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పలువురు ప్రముఖులు పరాజయం చవిచూశారు. పీపీపీకి చెందిన మాజీ ప్రధాని రాజా పర్వేజ్‌ అష్రఫ్‌, మాజీ సమాచార ప్రసార శాఖ మంత్రి ఖమర్‌ జమాన్‌ కైరా, ఫిర్‌దౌన్‌ ఆశిఖ్‌ అవాన్‌,…