Sunday, 22 November 2026

హైదరాబాద్

రెండు రోజుల పాటు జరగనున్న జనతాదళ్‌ సమావేశం

న్యూఢీల్లీ, జనంసాక్షి: జనతాళ్‌ యునైటెడ్‌కు చెందిన అగ్రశ్రేణి నేతల సమావేశం ప్రారంభమయింది. రెండు రోజులు పాటు జరగనున్న ఈ సమావేశాల్లో భాజపాతో పొత్తుపై చర్చించనున్నట్టు తెలియవచ్చింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోడీని ఎన్డీయే ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారన్న ప్రచారం…

గోడకూలి విద్యార్థిని మృతి

గుంటూరు, జనంసాక్షి: తెనాలి మండలం అంగలకుదురులో విషాదం చోటు చేసుకుంది. ఉన్న ప్రైవేటు పాఠశాల గోడ కూలి ఓ విద్యార్థిని మృతి చెందింది.విద్యార్థిని ఏడవ తరగతి చదువుతుంది. మృతురాలి తల్లిదండ్రులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.

ఆనం వ్యాఖ్యలు వంద శాతం నిజం : బొత్స

అనంతపురం, జనంసాక్షి: జగన్‌పై మంత్రి ఆనం చేసిన వ్యాఖ్యలు వంద శాతం నిజమని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ అన్నారు. హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి ఏతప్పు చేయలేదని ఆయన చెప్పారు. జగన్‌, షర్మిలను నమ్మితే దొంగల రాజ్యం , దోపిడీ…

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్‌

ముంబయి, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా ముంబయి ఇండియన్స్‌, పుణె వారియర్స్‌ జట్ల మధ్య ఇవాళ మ్యాచ్‌ జరుగుతుంది.ఈ మ్యాచ్‌ మంబయి ఇండియన్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌ ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది.

గర్భిణిపై సామూహిక అత్యాచారం

కడప, జనంసాక్షి: నిర్భయ చట్టం రేప్‌ నిందితులకు భయాన్ని కలిగించడంలేదు. మహిళలపై రేపిస్టులు తమ దురాగతాలను కొనసాగిస్తూనే ఉన్నారు. కన్నుమిన్ను కానకుండా ఓ నిండు గర్భినిపై నలుగురు కామాందులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లిలో ఈఘోర…

పీఎస్‌లో ఆత్మహత్యాయత్నం చేసుకున్న యువతి

కరీంనగర్‌, జనంసాక్షి: ప్రేమ వ్యవహారంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన జగిత్యాల్‌ పోలీసు స్టేషన్‌లో చోటుచేసుకుంది. ప్రియుడికి పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తోండగా ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెకు పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

సూరారంలో ఇద్దరు బాలికల అదృశ్యం

హైదరాబాద్‌, జనంసాక్షి: బాలకల అదృశ్యం వార్తలతో అమ్మాయిల తల్లిదండ్రులు వణికిపోతున్నారు. తాజాగా దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇద్దరు బాలికలు అదృశ్యమవడంతో మరోసారి నగరంలో ఉధ్రిక్తత ఏర్పడింది. శుక్రవారం రాత్రి బయటకు వెళ్లిన అనూష(10), అంబిక(14) అనే ఇద్దరు…

బారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్‌: బంగారం, వెండి ధరలు బారీగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర రూ 1300, కిలో వెండి ధర రూ 2800 తగ్గింది.నగర మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ…

రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపిన నవాబ్స్‌ విద్యార్థులు

కరీంనగర్‌ : ఎడురానెట్‌ ఒలంపియాడ్‌ రాష్ట్రస్థాయి సైన్స్‌ అండ్‌ రిసోర్సు కాంపీటీషన్‌లో నవాబ్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు సామియామనాల్‌ , సమీహాఅస్వద్‌, హుమేహని సలీం, హుదాపాతీమా ,అజ్రాపాతీమా ,…

ఎల్లుండి నుంచి పెట్రోల్‌ బంద్‌ పాటించనున్న ట్యాంకర్ల ఓనర్లు

హైదరాబాద్‌, జనంసాక్షి: పెట్రోల్‌ ట్యాంకర్ల ఓనర్లు ఎల్లుండి బంద్‌ పాటించనున్నారు. పెంచిన వ్యాట్‌ను తగ్గించనందుకు నిరసనగా పెట్రోల్‌ ట్యాంకర్ల యజమానుల సంఘం ఎల్లుండి నుంచి బంద్‌కు పిలుపునిచ్చింది. ఈమేరకు సంఘం ప్రతినిధులు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.